Begin typing your search above and press return to search.
RRR డే: ఆనాటి రాజమౌళి - రామ్ చరణ్ - రామారావు పిక్ వైరల్..!
By: Tupaki Desk | 25 March 2022 11:30 AM GMTయావత్ సినీ ప్రపంచం ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' మానియాలో తడిసి ముద్దవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా 'బాహుబలి' సృష్టికర్త దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా.. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో RRR కు బీజం వేసిన ఒకప్పటి ఫోటోని చిత్ర బృందం గుర్తు చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పిక్ వైరల్ గా మారింది.
'బాహుబలి' తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసిన జక్కన్న.. తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో చేస్తాడో అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. అలాంటి సమయంలో దాదాపు నాలుగేళ్ల క్రితం 18 నవంబర్ 2017న రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి సోఫాలో వాలిపోయి ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసారు. ఇలా రాజమౌళితో గతంలో వర్క్ చేసిన మెగా - నందమూరి హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో అందరిలో ఆసక్తి మొదలైంది.
2018 మార్చి 22న #RRR అనే హ్యాష్ ట్యాగ్ తో ఎన్టీఆర్ - రామ్ చరణ్ - రాజమౌళి వంటి సెన్సేషనల్ కాంబోలో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇక్కడ 'ఆర్.ఆర్.ఆర్' అంటే రాజమౌళి - రామారావు - రామ్ చరణ్ అన్నమాట.
ఈ వర్కింగ్ టైటిల్ జనాల్లోకి బాగా వెళ్ళిపోవడంతో దీన్నే సినిమాకు ఫిక్స్ చేశారు. 2020 మార్చి 25న RRR ను వివిధ భాషల్లో విస్తరిస్తూ.. తెలుగులో 'రౌద్రం రణం రుధిరం' గా టైటిల్ పెట్టారు.
'రౌద్రం రణం రుధిరం' (RRR) టైటిల్ ప్రకటించిన సరిగ్గా రెండేళ్లకు.. అంటే ఈరోజు (25 మార్చి 2022) ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇటీవల పలు ఇంటర్వ్యూలో ఫస్ట్ పోస్ట్ చేసిన ఫోటోపై హీరోలు స్పందించారు. రాజమౌళి ఆహ్వానం మేరకు ఇద్దరం కలిసి ఆయన ఇంటికి వెళ్లామని.. కథ వినకముందే ఆ ఫోటో దిగామని.. ఆ తర్వాత కథ విని కాఫీ తాగామని చెప్పుకొచ్చారు.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. పదమూడేళ్ల క్రితమే దానయ్యకు ఓ సినిమా చేస్తానని రాజమౌళి మాట ఇచ్చారు. 'మర్యాద రామన్న' లాంటి సినిమా చేద్దామని రాజమౌళి అడిగినా.. తనకు పెద్ద సినిమాయే కావాలని నిర్మాత చెప్పారట. ఈ క్రమంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి అగ్ర హీరోతో భారతదేశపు బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని అందించారు. కనీవినీ ఎరుగని ప్రమోషన్స్ తో ఊహకు అందని ప్రీరిలీజ్ బజ్ తో వచ్చిన RRR ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.