Begin typing your search above and press return to search.

జపాన్ లో RRR విధ్వంసం.. బాహుబలి రికార్డ్ బ్రేక్ నెక్స్ట్ టార్గెట్ అదే..!

By:  Tupaki Desk   |   18 Nov 2022 6:30 AM GMT
జపాన్ లో RRR విధ్వంసం.. బాహుబలి రికార్డ్ బ్రేక్ నెక్స్ట్ టార్గెట్ అదే..!
X
జపాన్ లో RRR అద్భుతాలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 21న జపాన్ లో ట్రిపుల్ ఆర్ రిలీజైంది. రిలీజ్ సందర్భంగా ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాజమౌళి అక్కడ సూపర్ ప్రమోషన్స్ చేశారు. సినిమాలో విషయం ఉండటం.. ప్రమోషన్స్ కూడా తోడవడంతో ఆర్.అర్.ఆర్ జపాన్ లో విధ్వంసాలు సృష్టిస్తుంది.

అక్కడ ఫస్ట్ వీక్ లోనే 75 మిలియన్ యాన్ లు కలెక్ట్ చేసింది. ఇక నాల్గవ వారం పూర్తి కాకుండానే 250 మిలియన్ యాన్ లను రాబట్టింది. జపాన్ లో ఇదివరకు సినిమాల రికార్డులు చూస్తే చివరగా బాహుబలి 250 మిలియన్ యాన్ లు వసూళు చేసింది.

ఇప్పుడు RRR ఆ రికార్డ్ బద్ధలు కొట్టింది. అయితే ఆర్.ఆర్.ఆర్ ముందు మరో పెద్ద టార్గెట్ ఉంది. అదే సూపర్ స్టార్ రజినీ ముత్తు మూవీ. 90ల్లోనే ఈ సినిమా జపాన్ లో రిలీజై 400 మిలియన్ యాన్ ల దాకా కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా ఈ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది.

ఆర్.ఆర్.ఆర్ దూకుడు చూస్తుంటే ముత్తు రికార్డ్ బ్రేక్ చేసేలా ఉంది. ఒకప్పుడు సినిమాలు 100 రోజులు ఆడేవి కానీ ఇప్పుడు మన దగ్గర రెండు, మూడు వారాలే మ్యాక్సిమం వసూళ్లు రాబడుతున్నాయి. అయితే జపాన్ లో మాత్రం ఇప్పటికీ ఆనాటి పరిస్థితులే ఉన్నాయి.

ఇప్పటికీ అక్కడ సినిమాలు 100, 150 రోజులు ఆడుతున్నాయి. సో ఆర్.ఆర్.ఆర్ కూడా అక్కడ ఎక్కువ రోజులే ప్రదర్శితమయ్యే ఛాన్స్ ఉంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాలకు జపాన్ లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఇదివరకు తారక్ సినిమాలు అక్కడ మంచి వసూళ్లను రాబట్టాయి. ఆ ఇంప్యాక్ట్ కూడా ఆర్.ఆర్.ఆర్ మీద పడ్డది. ఫైనల్ గా ఆర్.ఆర్.ఆర్ ముత్తు రికార్డ్ టార్గెట్ ని పెట్టుకుంది. 400 మిలియన్ యాన్ ల ముత్తు రికార్డ్ ట్రిపుల్ ఆర్ చెరిపేస్తే మాత్రం ఆ సినిమా ఖాతాలో మరో అద్భుతమైన రికార్డ్ వచ్చి చేరినట్టే.

RRR సినిమా లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటన విశ్వరూపం పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ ప్రేక్షకులను అలరించింది. సినిమా థియేట్రికల్ రన్ లోనే కాకుండా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రాజమౌళి ఏ సినిమా తీసినా అదొక మాస్టర్ పీస్ అనే అని మరోసారి ఆర్.ఆర్.ఆర్ తో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్తుందని ఆశించినా అది కాస్త నిరాశపరచింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.