Begin typing your search above and press return to search.
#RRR కర్నాటక రిలీజ్ ఆ రేంజులోనా?
By: Tupaki Desk | 27 March 2020 3:30 AM GMTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `ఆర్.ఆర్.ఆర్` మోషన్ పోస్టర్ ఇప్పుడు మెగా-నందమూరి అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. బుధవారం రిలీజైన మోషన్ పోస్టర్ అభిమానులకు ఊహించని ట్రీట్ ని ఇచ్చింది. తారక్-చరణ్ పాత్రల వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుందో జక్కన్న పోస్టర్లోనే చెప్పేసాడు. రెండు పాత్రలు తెరపై పోటా పోటీగా సాగనున్నాయని ఫ్యాన్స్ కి అర్థమైంది. దీంతో ఈ పాన్ ఇండియాపై అంచనాలు మరోసారి అమాంతం స్కైని టచ్ చేస్తున్నాయి. ఇక సినిమా బిజినెస్ పరంగా ఎలా ఉండనుందో చూడాలి. జక్కన్న క్రియేటివిటీ చరణ్-తారక్ ఇమేజ్ లతో ఈ సినిమా వందల కోట్ల వ్యాపారం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
రిలీజ్ కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పీక్స్ లో సాగుతోందట. ఇక తెలుగు రాష్ట్రాల్లో చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్య భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. రైట్స్ ఎవరికి కట్టబెట్టకుండా ప్రతి రూపాయి తన ఖాతాలోనే జమ అయ్యేలా వోన్ రిలీజ్ కు సిద్ధమవుతున్నారు. చరణ్-తారక్ క్రేజ్ నడుమ ఈ ఏడాదంతా ఆ ఇద్దరి హీరోల నామ జపం తప్పదని తాజా సన్నివేశం చెబుతోంది. ఇక కర్ణాటకలోనూ రిలీజ్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా అక్కడా భారీ ఎత్తున ప్లాన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కర్ణాటక రిలీజ్ హక్కులను వారాహి చలన చిత్రం తీసుకుంది. తాజాగా ఆ సంస్థకు తోడుగా ఏషియన్ ఫిలింస్- కేఆర్ జీ స్టూడియోస్ కూడా జతకడుతున్నాయి.
వారాహి తో కలిసి సదరు రెండు సంస్థలు పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. బాహుబలి- కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్ని రిలీజ్ చేసిన సంస్థగా వారాహి క్రేజు వేరు. అందుకే అక్కడ మాసివ్ రిలీజ్ ఖాయమని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాలకు కర్ణాకటలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తారక్ ప్రతీ సినిమా అక్కడ తప్పక రిలీజ్ అవుతుంటుంది. అలా కన్నడిగులకు తారక్ బాగా దగ్గరయ్యాడు. ఎన్టీఆర్ తల్లి గారిది స్వస్థలం కర్ణాటకనే కావడం తనకు మరింత కొలిసొస్తోంది. ఇక రామ్ చరణ్ సినిమాలు తరుచూ అక్కడ రిలీజ్ అవుతుంటాయి. ఇలా ఈసారి ఒకే ప్రేమ్ లో ఇద్దరు టాప్ హీరోలు అక్కడ అభిమానుల్ని అలరించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.