Begin typing your search above and press return to search.
RRR: ఆస్కార్ అవార్డ్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయాల్సిందేనా..?
By: Tupaki Desk | 8 Oct 2022 2:15 PM GMT'ఆర్.ఆర్.ఆర్' విడుదలై నెలలు గడుస్తున్నా ఈ సినిమా మ్యానియా ఏమాత్రం తగ్గడం లేదు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ క్యాంపెయిన్ లోకి అడుగుపెట్టి గ్లోబల్ సర్క్యూట్ లో సందడి చేస్తోంది.
RRR సినిమాకి హాలీవుడ్ ప్రశంసలు దక్కిన తర్వాత కచ్చితంగా ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మన దేశం తరపున ఈ చిత్రాన్ని అకాడమీ అవార్డ్స్ పరిశీలనకు అఫిషియల్ ఎంట్రీగా ఎంపిక చేయలేదు. అయినప్పటికీ జక్కన్న అండ్ టీమ్ ఆస్కార్ ప్రయత్నాలు వదిలిపెట్టలేదు.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ఫర్ యువర్ కన్సిడరేషన్ (FYC) కింద ఆస్కార్ జ్యూరీ పరిశీలనకు పంపించారు. మొత్తం పదిహేను క్యాటగిరీలలో నామినేషన్స్ కోసం క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా కుమారుడు కార్తికేయతో కలిసి రాజమౌళి గత కొన్ని రోజులుగా అమెరికాలోనే గడుపుతున్నారు. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ కు హాజరవుతూ ట్రిపుల్ ఆర్ ను ప్రమోట్ చేస్తున్నారు.
అయితే RRR సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ కోసం దాదాపు 50 కోట్ల వరకూ వెచ్చిస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి సినీ రంగంలో ప్రతిష్టాత్మక అవార్డ్స్ గా భావించే అకాడమీ పురస్కారాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లిన తర్వాత చాలా తతంగం ఉంటుంది. ఆస్కార్ కమిటీ సభ్యులను ఆకర్షించడానికి.. ఓటింగ్ లో ఇతర దేశాల సినిమాల కంటే ఎక్కువ ఓట్లు రాబట్టడానికి భారీగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా భరించలేకనే చాలా సినిమాలు ఆస్కార్ పై ఆశలు వదులుకుంటుంటారు.
ఈ నేపథ్యంలో ఆస్కార్ పరిశీలనకు ఎంపిక చేయబడిన చిత్రానికి ప్రచారం ఖర్చుల కోసం మనదేశంలో రూ. 50 లక్షలు ఇస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు RRR సినిమాని ఇండియా తరపున అధికారిక ఎంట్రీ కింద పంపలేదు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ చిత్రాన్ని పక్కన పెట్టి.. ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో గుజరాతీ ఫిల్మ్ 'ఛెలో షో' కి అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది.
కాబట్టి ఇప్పుడు RRR సినిమా క్యాంపెయిన్ కోసం ఖర్చంతా మేకర్స్ భరించాల్సి ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్ మరియు హాలీవుడ్ జనాల అభిప్రాయాలను బట్టి చూస్తే.. ఆస్కార్ అకాడమీ ఏదో ఒక విభాగంలో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని పరిగణించవచ్చని తెలుస్తోంది.
ప్రధాన కేటగిరీల్లో కాకపోతే కన్సోలేషన్ అవార్డు లేదా స్పెషల్ జ్యూరీ అవార్డు అయినా RRR కు ఆస్కార్ అకాడమీ ఇవ్వవచ్చని కూడా అంటున్నారు. ఆస్కార్ కు నామినేట్ అవ్వడం అనేది రాజమౌళి కెరీర్ ను సానుకూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే దర్శకధీరుడు తెరకెక్కించే సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడవుతుంటాయి. ఇప్పుడు RRR సినిమాకు ఆస్కార్ వచ్చినా రాకపోయినా అంతర్జాతీయంగా జక్కన్న కు వచ్చిన గుర్తింపును బట్టి.. ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడవుతాయని భావించవచ్చు.
RRR ఆస్కార్ అవార్డ్ సాధిస్తే.. అది తెలుగు సినిమాకే కాదు.. భారతీయ సినిమాకు గర్వకారణంగా పేర్కొనవచ్చు. మరి ఈ చిత్రానికి గ్లోబల్ ప్రశంసలు దక్కిన తర్వాత.. జక్కన్న చేస్తున్న ప్రయత్నాలకు పురస్కారాలు లభిస్తాయో లేదో.. ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.