Begin typing your search above and press return to search.

దోస్తీకి ఇతర భాషల్లో రెస్పాన్స్‌

By:  Tupaki Desk   |   11 Aug 2021 3:26 AM GMT
దోస్తీకి ఇతర భాషల్లో రెస్పాన్స్‌
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్ సినిమా నుండి వచ్చిన దోస్తీ పాటకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. తెలుగులో హేమ చంద్ర పాడిన ఈ పాటను ఇప్పటి వరకు లహరి.. టీ సిరీస్ యూట్యూబ్ ఛానెల్స్ లో కలిపి దాదాపుగా 17 మిలియన్స్ వరకు వ్యూస్ వచ్చాయి. దోస్తీ సాంగ్ విజువల్స్ కూడా అద్బుతంగా ఉండటంతో సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ మరింత ఆసక్తిగా ఉన్నారు. తెలుగు తో పాటు హిందీ.. తమిళం.. కన్నడం మరియు మలయాళం భాషల్లో కూడా దోస్తీ పాటను విడుదల చేశారు. ఆయా భాషల్లో దిగ్గజ సింగర్స్ ను రంగంలోకి దించిన కీరవాణి ది బెస్ట్‌ ఔట్ ను తీసుకు వచ్చేలా ప్రయత్నించాడు. అన్ని భాషల్లో మిలియన్స్ కు మిలియన్స్ వ్యూస్ వస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. అన్ని భాషల్లో కూడా మంచి వ్యూస్ వచ్చాయి.

తెలుగు తర్వాత అత్యధికంగా హిందీ దోస్తీకి 11 మిలియన్‌ ల వ్యూస్‌ వచ్చాయి. బాలీవుడ్‌ స్టార్‌ సింగర్ అమిత్ త్రివేది ఈ పాటను పాడటం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి అనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌ ఆడియన్స్ అమిత్ త్రివేది పాడిన పాట అవ్వడంతో పాటు బాహుబలి మేకర్‌ రాజమౌళి నుండి రాబోతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా పాట అవ్వడం వల్ల కూడా అంచనాలు పెట్టుకుని ఉన్నారు. వారి అంచనాలు అందుకునేలా అమిత్‌ పాట.. కీరవాణి మ్యూజిక్‌ విజువల్స్ అన్ని కలగలిశాయి.

ఆకట్టుకునే విధంగా హిందీ దోస్తీ సాంగ్‌ కుదిరింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హిందీ తర్వాత తమిళంలో స్టార్ కంపోజర్‌ అనిరుథ్‌ పాడటం వల్ల మంచి వ్యూస్ వస్తాయని అంతా ఆశించారు. తమిళం దోస్తీకి కూడా కనీసం 10 మిలియన్స్ వ్యూస్ వస్తాయని ఆశించిన మేకర్స్‌ కు నిరాశ తప్పలేదు. అనిరుథ్‌ పాడినా కూడా తమిళ జనాలు పెద్దగా ఆసక్తి చూపించినట్లుగా అనిపించలేదు. ఇప్పటి వరకు తమిళ వర్షన్‌ దోస్తీకి యూట్యూబ్‌ లో 4.8 వ్యూస్‌ ను మాత్రమే దక్కించుకుంది.

అన్ని భాషల్లోకి తమిళ భాషలో అనిరుథ్‌ మంచి బేస్ వాయిస్ తో మంచి ఫీల్ తో పాడాడు అంటూ కామెంట్స్ వచ్చాయి. కాని వ్యూస్ విషయంలో మాత్రం తమిళ దోస్తీకి నిరాశ మిగిలింది. తమిళ ఆడియన్స్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం ఇంట్రెస్ట్‌ గానే ఉన్నట్లుగా తమిళ మీడియా కథనాలు వస్తున్నాయి. కాని తమిళ దోస్తీకి మాత్రం ఊహించిన రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇతర భాషల వ్యూస్ విషయానికి వస్తే కన్నడ దోస్తీకి గాను దాదాపుగా రెండు మిలియన్‌ ల వ్యూస్ వచ్చాయి. ఇక మలయాళ వర్షన్‌ దోస్తీకి గాను 1.8 మిలియన్ ల వ్యూస్‌ వచ్చాయి. అయిదు భాషల్లో కూడా దోస్తీ సినిమా పై జనాల్లో ఉన్న ఆసక్తిని మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు. అక్టోబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌ సినిమా వసూళ్ల పరంగా అన్ని భాషల్లో కూడా సరికొత్త రికార్డులను రీచ్‌ అవుతుందేమో చూడాలి.

ఉక్రెయిన్‌ లో చివరి దశ షూటింగ్‌ జరుపుతున్న చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ నెల చివరి వరకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లపై ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా నుండి రెండవ పాట వస్తుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.