Begin typing your search above and press return to search.

జ‌పాన్ లో 18 కోట్లు తెచ్చిన 'ఆర్ ఆర్ ఆర్'

By:  Tupaki Desk   |   28 Nov 2022 5:54 AM GMT
జ‌పాన్ లో 18 కోట్లు తెచ్చిన ఆర్ ఆర్ ఆర్
X
'ఆర్ ఆర్ ఆర్' పాన్ ఇండియా వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. 1100 కోట్ల వ‌సూళ్ల‌తో ఇండియాలో మూడ‌వ అతి భారీ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. 'బాహుబ‌లి'..'దంగ‌ల్' రికార్డులు బ్రేక్ చేయాలి అన్న అంచ‌నాల‌తో రాకుండానే ఈ రేంజ్ లో వ‌సూళ్ల సునామీ సృష్టించింది. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గ‌నుక ముందుగానే టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆ క‌థ మరోలా ఉండేది.

అలాగే ఓవ‌ర్సీస్ లోనూ సినిమా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. అమెరికా స‌హా...కొన్ని దేశాల్లో అనూహ్య వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఇక ఓటీటీ ప్ర‌భంజ‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఓటీటీతో హాలీవుడ్ నే షేక్ చేసిందా సినిమా. సినిమా చూసి హాలీవుడ్ మేక‌ర్స్ ఏకంగా రామ్ చ‌ర‌ణ్‌కి త‌మ సినిమాల్లో అవ‌కాశాలు కూడా క‌ల్పించారు. ఆస్కార్ నామినేష‌న్ బ‌రిలోనూ నిలిచింది.

ఇదంతా ఏమాత్రం గెస్ చేయ‌న‌ది. అనుకోకుండా సినిమాకి ద‌క్కిన గుర్తింపు ఇది. అందుకే జ‌క్క‌న్న అమెరికాలో తిష్ట వేసి ఎలాగైనా ఆస్కార్కి నామినేట్ చేయాల‌ని శ‌క్తి వంచ‌న లేకుండా శ్ర‌మిస్తున్నారు. ఇటీవ‌లే సినిమా జ‌పాన్ లోనేఊ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కి ముందు అక్క‌డా చ‌ర‌ణ్‌..టైగ‌ర్....రాజ‌మౌళి వీలైనంత వ‌ర‌కూ ప్ర‌చారం నిర్వ‌హించారు.

అక్క‌డి ప్రేక్ష‌కుల‌తో ప్ర‌త్యేకంగా ఇంట‌రాక్ట్ అయ్యారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయిన 30 రోజుల్లోనే భారీ వ‌సూళ్లు సాధించింది. 300 మిలియ‌న్ల జ‌పాన్ యోన్ ల క్ల‌బ్ లోచేరింది. అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో చెప్పాలంటే 18 కోట్ల‌కు సాధించింద‌ని చెప్పొచ్చు. ఈక్ల‌బ్లో అత్యంత వేగంగా చేరిన తొలి భారతీయ చిత్ర‌మిది.

ఆ ర‌కంగా జ‌పాన్ మార్కెట్ ని ఆర్ ఆర్ ఆర్ తెలుగు సినిమా షేక్ చేసింద‌ని చెప్పొచ్చు. జపాన్ లో చాలా త‌క్కువ సంఖ్య‌లోనే తెలుగు ఆడియ‌న్స్ ఉన్నారు. 'బాహుబ‌లి'తో రాజ‌మౌళికి జ‌సాన్ లో క్రేజ్ ఏర్ప‌డింది. ఆ న‌మ్మ‌కంతోనే 'ఆర్ ఆర్ ఆర్' ని అక్క‌డా రిలీజ్ చేసారు. ఫ‌లితం ఊహించిన దానికంటే గొప్ప‌గానే ఉంద‌ని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.