Begin typing your search above and press return to search.

RRR కూడా వైర‌స్ లా త‌యారైందే!

By:  Tupaki Desk   |   2 Jan 2022 5:24 AM GMT
RRR కూడా వైర‌స్ లా త‌యారైందే!
X
క‌రోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ భ‌యంతో పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. దీంతో జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవ్వాల్సి `భీమ్లా నాయ‌క్`ని వాయిదా వేసుకున్నారు. `ఆర్ ఆర్ ఆర్` ప్లానింగ్ ముందే జ‌రిగిపోయింది దానికి త‌గ్గ‌ట్టు ఆచార్య‌..స‌ర్కారు వారి పాట లాంటి చిత్రాలు సైతం పోటీ ఉందుక‌ని వెన‌క్కి త‌గ్గాయి. ఇలా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అవుతుందంటే? ఇన్ని సినిమాలు డిస‌ర్బ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్` వాయిదా భ‌విష్య‌త్ రిలీజ్ ల‌కు ఏకు మేకై కూర్చుంది.

ఉరిమెళ్లి మంగ‌ళం మీద ప‌డిన‌ట్లు `ఆర్ ఆర్ ఆర్` ఎప్పుడు రిలీజ్ అయినా మిగ‌తా సినిమాలకు పెద్ద ఎదురుదెబ్బ త‌ప్ప‌దు. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వేస‌వి తేదీల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఫిబ్ర‌వ‌రి నుంచి ఏప్రిల్ వ‌ర‌కూ ఇప్ప‌టికే కొన్ని సినిమాలు డేట్లు లాక్ చేసి పెట్టుకున్నాయి. ఓసారి ఆ విశ్లేష‌ణ‌లోకి వెళ్తే.. చిన్న సినిమాల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఫిబ్ర‌వ‌రి 4న మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `ఆచార్య` రిలీజ్ అవుతుంది. అలాగే 11వ తేదీన ర‌వితేజ న‌టిస్తోన్న `ఖిలాడి`..అడ‌వి షేష్ న‌టిస్తోన్న `మేజ‌ర్` చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 25న `భీమ్లా నాయ‌క్`..మార్చి 18న `పక్కా క‌మర్శియ‌ల్`.` `గ‌ని`.. మార్చి 25న` రామారావు ఆన్ డ్యూటీ` రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు.

ఏప్రిల్ 1న `స‌ర్కారు వారి పాట‌`.. అదే నెల 14న పాన్ ఇండియా చిత్రం `కేజీఎఫ్-2`.. 29న `ఎఫ్ -3`.. `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`..`మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` రిలీజ్ అవుతున్నాయి. జులై 29న `స‌లార్`.. ఆగ‌స్టు11న `ఆదిపురుష్`..25న `లైగ‌ర్` చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ లో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం సాగుతుంది. తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే పై చిత్రాలు లాక్ చేసుకున్న తేదీలకు వారం అటు ఇటుగా `ఆర్ ఆర్ ఆర్` వ‌స్తే ఆ చిత్రాలు తేదీలు మార్చుకునే అవ‌కాశం ఉంది. అప్ప‌టికి ఓమిక్రాన్ వైర‌స్ అంత‌టా పీక్స్ లో ఉంటుంద‌ని మ‌రోవైపు నివేదిక‌లు హెచ్చ‌రిస్తున్నాయి. కాబ‌ట్టి రిలీజ్ లు వెనుక ఎంత ప్లానింగ్ ఉన్నా వైర‌స్ గానీ.. `ఆర్ ఆర్ ఆర్` గాని వాటిని త‌ల్ల‌కిందులు చేసే అవ‌కాశం అయితే ఉంది. మొత్తానికి ఒకే ఒక్క సినిమా...ర‌క‌ర‌కాల వైర‌స్ లు మిగ‌తా హీరోల్ని ఈ రేంజ్ లో టార్గెట్ చేస్తాయ‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు.