Begin typing your search above and press return to search.
#చిరు 152 కష్టాల్ని #RRR పైకి తోసేస్తారేం?
By: Tupaki Desk | 6 March 2020 6:15 AM GMT2020-21 సీజన్ మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ గా #RRR పాపులరైంది. బాహుబలి దర్శకుడి నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాగా ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన రకరకాల రూమర్లు నిరంతరం చరణ్ .. తారక్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రేజు తగ్గించే ఏ చర్యనూ రాజమౌళి అంగీకరించడం లేదని పొరుగు ప్రాజెక్టులను అతడు ప్రభావితం చేస్తున్నాడని తామర తంపరగా ప్రచారం సాగిపోతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించే 152వ సినిమాలో రామ్ చరణ్ నటిస్తే అది ఆర్.ఆర్.ఆర్ కి డ్యామేజ్ చేస్తుందట. అందువల్ల చెర్రీ నటించకుండా జక్కన్న మోకాలు అడ్డాడని ప్రచారమైంది. అంతటితో ఆగిందా? రాజమౌళి భయపడడం వల్లనే.. ఆర్.ఆర్.ఆర్ కండిషన్లకు కట్టుబడి చరణ్ ఆ చిత్రం లో నటించడం లేదని దర్శకుడి కండిషన్లకు తలవొంచి వదులుకున్నాడని సోషల్ మీడియా ఊదరగొట్టేసింది. ఆ తర్వాత చిరు 152లో చరణ్ చేయాల్సిన ఆ పాత్రలో మహేష్ నటిస్తారని కొత్త ప్రచారం ఊపందుకుంది. చిరంజీవి- మహేష్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ ఖాయమవ్వడం మెగా - ఘట్టమనేని అభిమానుల్లో ఉత్సాహం నింపిందన్న వార్తా అంతే వేడెక్కించింది.
ఇప్పుడు దీని పైనా రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి. చిరంజీవి- మహేష్ మల్టీస్టారర్ కచ్ఛితం గా చరణ్ - ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ కి పెద్ద ముప్పుగా మారుతుందని.. ఆ మల్టీస్టారర్ క్రేజు ముందు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ క్రేజు దిగదుడుపేనని ప్రచారం సాగిపోతోంది. అంతేకాదు... చిరంజీవి సినిమాలో మహేష్ నటించకుండా మరోసారి ఆర్.ఆర్.ఆర్ దర్శకుడే మోకాలడ్డారన్న ప్రచారం అంతే గుసగుసగా వినిపిస్తోంది. అయితే ఇది నిజమా? ఆ మల్టీస్టారర్ తెరకెక్కితే ఆర్.ఆర్.ఆర్ కి వచ్చే నష్టమేంటి? రాజమౌళి మరీ అంత భయపడుతూ తీస్తున్నారా? అయినా చరణ్ .. తారక్ ఏమైనా మరీ అతీ గతీ లేని స్టార్లా? చిరంజీవి.. మహేష్ తర్వాత జనరేషన్ లో ఆ ఇద్దరూ అసాధారణ స్టార్ డమ్ తో వెలగడం లేదా? బాక్సాఫీస్ వద్ద 100 - 200 కోట్ల గ్రాస్ వసూళ్లు తెచ్చే సత్తా ఆ ఇద్దరికీ లేదా? ఇదంతా సోషల్ మీడియా లంపటం తప్ప అసలు జక్కన్న టీమ్ నుంచి కానీ కొణిదెల టీమ్ నుంచి కానీ ఈ విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం లేనేలేదు. అయినా ప్రచారం మాత్రం ఇలా రకరకాలుగా సాగిపోతుండడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అటు ఘట్టమనేని ఫ్యాన్స్ డైలమాలో పడిపోతున్నారు. అయితే అన్ని రూమర్లకు చెక్ పెట్టేస్తూ జక్కన్న మీడియా ముందుకు ఎప్పుడొస్తాడో కానీ.. అప్పటివరకూ ఈ ప్రచారం ఇంతేనేమో!