Begin typing your search above and press return to search.
'ఆర్ఆర్ఆర్' ఎమోషనల్ సీన్ క్రేజీ న్యూస్..!
By: Tupaki Desk | 29 April 2021 3:30 PM GMTదర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు. బాహుబలి సిరీస్ విడుదలై నేమ్ ఫేమ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచింది. ఇప్పుడు ఆ ఫేమ్ తోనే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రేక్షకులలో ఎక్కడలేని ఆసక్తి ఏర్పడింది. గతేడాది కాలంగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రతిసారి ఏదొక ఆటంకం ఏర్పడుతూనే ఉంది. నిజానికి ఇదివరకు రెండుసార్లు డేట్ అనౌన్స్ చేశారు కానీ వాయిదా పడింది. ఈసారి మాత్రం పక్కా అంటూ అక్టోబర్ 13ను రిలీజ్ డేట్ గా ప్రకటించారు.
నెలలు గడుస్తున్నా కొద్దీ రిలీజ్ తేదీ ఆసన్నమవుతోంది. ఓవైపు ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మల్టీస్టారర్. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో వీరిద్దరూ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను పోషిస్తున్నారు. షూటింగ్ కూడా చివరిదశలో ఉండటంతో సినిమా గురించి ఏ చిన్న వార్త తెలిసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో ఓ భావోద్వేగమైన సన్నివేశం గురించి న్యూస్ బయటికి వచ్చింది. ఏంటంటే.. ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ జైలులో కలిసే సీన్ అందరిని ఎమోషనల్ గా ఏడిపిస్తుందని టాక్. అలాంటి సీన్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయని మేకర్స్ ఇదివరకే తెలిపారు. ఈ సినిమాలో అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డీవీవి దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నాడు.