Begin typing your search above and press return to search.

ప్ర‌చార ప‌ర్వానికి `ఎత్త‌ర జెండా..`తో శ్రీ‌కారం

By:  Tupaki Desk   |   10 March 2022 12:44 PM GMT
ప్ర‌చార ప‌ర్వానికి `ఎత్త‌ర జెండా..`తో శ్రీ‌కారం
X
టాలీవుడ్ మోస్ట్ పాపుల‌ర్ స్టార్స్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన భారీ పాన్ ఇండియ‌న్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌ (రౌద్రం ర‌ణం రుధ‌రం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ గ‌త కొన్ని నెల‌లుగా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. క‌రోనా కార‌ణంగా రిలీజ్ డిలే అవుతూ వ‌చ్చిన ఈ మూవీని జ‌న‌వ‌రి 7న సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఈ మూవీ ప‌బ్లిసిటీల కోసం దాదాపు 20 కోట్లు ఖ‌ర్చు చేశారు.

అయితే ఒమిక్రాన్‌, క‌రోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా ఈ మూవీ దురదృష్ణ వ‌శాత్తు మ‌ళ్లీ వాయిదా ప‌డాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అదుపులోకి రావ‌డం.. వ‌రుస‌గా భారీ చిత్రాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ఎట్ట‌కేల‌కు `ఆర్ ఆర్ ఆర్‌` ని మార్చి 25న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించేశారు. మార్చి 11న `రాధేశ్యామ్‌` రిలీజ్ అవుతున్న నేఫ‌థ్యంలో `ఆర్ ఆర్ ఆర్ ` టీమ్ ఇంకా ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించ‌లేదు.

ఈ నెల 18 నుంచి భారీగా ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేస్తారంటూ వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ ఆశ‌గా ఎదురుచూస్తున్న అభిమానుల‌కు గురువారం సాయంత్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ చిత్రంలోని కీల‌క సంద‌ర్భంలో వ‌చ్చే `ఎత్త‌ర జెండా...` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోతో `ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌చార ప‌ర్వానికి శ్రీ‌కారం చుడుతున్న‌ట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఈ పాట‌లో ఎన్టీఆర్, అలియా భ‌ట్, రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. మార్చి 14 న ఈ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేస్తున్న‌ట్టుగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ వైట్ క‌ల‌ర్ పంచెలు క‌ట్టుకుని, న‌డుముకి ట‌వ‌ల్ క‌ట్టుకుని స‌మ‌రానికి సై అన్న‌ట్టుగా చూస్తుంటే అలియాభ‌ట్ అంగా ఓణీ ధ‌రించి చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిసిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే అత్యంత క్రేజీ మూవీగా ఇప‌క్ప‌టికే దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఈమూవీ ప్ర‌మోష‌న్స్ ని ఈ నెల 18న దుబాయ్ లో భారీగా ఏర్పాట్లు చేయ‌బోతున్నారు. గ‌తంలో జ‌న‌వ‌రి లో రిలీజ్ అనుకున్న సంద‌ర్భంలో మేక‌ర్స్ ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వ‌హించింది.

అయితే రిలీజ్ వాయిదా ప‌డి రిలీజ్ మార్చికి మార‌డంతో మ‌రోసారి ప్ర‌చార ప‌ర్వాన్ని ప్రారంభిస్తోంది. 14న `ఎత్త‌ర జెండా` లిరిక‌ల్ వీడియోతో ప్ర‌చార ప‌ర్వానికి శ్రీ‌కారం చుట్టి ఆ త‌రువాత 18న దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. బెంగ‌ళూరులో 19న భారీ ఈ వెంట్ ని నిర్వ‌హించి ఫైన‌ల్ గా హైద‌రాబాద్ లో అంత‌కు మించిన స్థాయిలో ఈవెంట్‌ని ప్లాన్ చేశార‌ట‌.