Begin typing your search above and press return to search.

RRR ఇలా కూడా రాయొచ్చా అనుకున్నా!

By:  Tupaki Desk   |   12 Oct 2019 8:23 AM GMT
RRR ఇలా కూడా రాయొచ్చా అనుకున్నా!
X
భారీ పాన్ ఇండియా చిత్రం RRR క‌థాంశం విష‌యంలో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఏనాడూ దాయ‌లేదు. అప్ప‌ట్లో పార్క్ హ‌య‌త్ మీడియా స‌మావేశంలో అత‌డు క్లుప్తంగా క‌థ ఇదీ అని చెప్పేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ ప్రాంతానికి చెందిన విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్ల‌వ‌వీరుడు కొమ‌రం భీమ్ .. ఈ ఇద్ద‌రూ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులుగా మారే క్ర‌మంలో ఆ ఇద్ద‌రి బాల్యం ఎలా సాగింది? అస‌లు వీళ్లు పెరిగి పెద్ద‌వాళ్లు అయ్యే క్ర‌మం ఎలా న‌డిచింది? ఆ ఇద్ద‌రు వీరుల‌య్యాక‌ క‌లిసి ఆంగ్లేయుల‌పై పోరాటం సాగించి ఉంటే ఏమ‌య్యేది(ఇది పూర్తిగా క‌ల్పితం)? అన్న క‌థ‌ను చాలా వ‌రకూ ఫిక్ష‌న‌ల్ గా ఇమాజినేట్ చేసి క‌థ‌ను త‌యారు చేసుకున్నాం!! అని స్ప‌ష్టంగా ఆరంభ‌మే చెప్పేశారు. ఇన్నాళ్ల కెరీర్ లో రాజ‌మౌళి ఏనాడూ ఇంత క్లియ‌ర్ క‌ట్ గా త‌న సినిమాల క‌థ‌ల్ని ఓపెన్ గా చెప్పేయ‌లేదు. కానీ ఆర్.ఆర్.ఆర్ క‌థ‌ను చెప్పేశారు.

అయితే అప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ క‌థ ఇదీ అంటూ మీడియాలో సాగుతున్న ర‌చ్చ‌కు చెక్ పెట్టేసేందుకు .. అలాగే ఇది ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి సినిమా అంటూ భారీ అంచ‌నాల‌తో ఎవ‌రూ క‌న్ఫ్యూజ్ కాకూడ‌ద‌నే అలా ఓపెన్ చేశార‌ని అర్థ‌మైంది. విజ‌యేంద్రుడితో క‌లిసి రాజ‌మౌళి తాను ఎలాంటి సినిమాని చూపించాల‌ని భావించారో అది మొత్తం ముందే చెప్పేయ‌డంతో అప్పుడే ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఆ త‌ర్వాత అందుకు సింబాలిక్ అనిపించే ఆన్ లొకేష‌న్ ఫోటోలు కొన్ని రివీల‌య్యాయి. తాజాగా ఆర్.ఆర్.ఆర్ క‌థ‌పై మాట‌ల ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ స్పంద‌న‌ను బ‌ట్టి క‌థేంటో మ‌రోసారి అర్థ‌మ‌వుతోంది.

ఆర్.ఆర్.ఆర్ మాట‌ల ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ ఆర్.ఆర్.ఆర్ క‌థ‌పైనా రాజ‌మౌళిపైనా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తులు ఆస‌క్తిని రేకెత్తించాయి. సాయిమాధ‌వ్ మాట్లాడుతూ- ''ఆర్.ఆర్.ఆర్ నిజంగానే ఓ అద్భుత క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. రాజ‌మౌళి గారు క‌థ చెప్పిన‌ప్పుడు .. ఒక క‌థ‌ను ఇలా కూడా రాయొచ్చా అనిపించింది. ఆయ‌న క్లారిటీనే మ‌హ‌దాద్భుతం. ఆల్రెడీ ఆయన మనోఫలకంలో సినిమాని చూసేసుకున్నారు. ఇప్పుడు దానిని మనకి చూపించడానికి ఏం చెయ్యాలో అది చేస్తున్నారు అంతే!'' అంటూ ఎమోష‌న్ గా స్పందించారు.

బాహుబ‌లి చిత్రానికే ప‌ని చేయాల్సిన‌ది.. కానీ అప్పుడు కుద‌ర‌లేద‌ని ఈ ఇంట‌ర్వ్యూలో తెలిపారు సాయిమాధ‌వ్. ఏదైతేనేం.. ఎట్ట‌కేల‌కు జ‌క్క‌న్న‌తో బుర్రాకు కుదిరింది. ఇద్ద‌రు ఉద్ధండులు క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌లే సైరా చిత్రానికి సాయిమాధ‌వ్ అద్భుత‌మైన సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి డైలాగ్స్ కి థియేట‌ర్ల‌లో క్లాప్స్ ప‌డ్డాయి. అంత‌కుముందు క్రిష్ జాగ‌ర్ల‌మూడి తో క‌లిసి 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి'కి బుర్రా చ‌క్క‌ని ప‌ద‌సంప‌త్తితో మాట‌లు అందించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఆర్.ఆర్.ఆర్ కి మ‌రోసారి మాస్ట‌ర్ క్లాస్ డైలాగ్స్ ని అందిస్తార‌నే అభిమానులు భావిస్తున్నారు.