Begin typing your search above and press return to search.
RRR ముంబై ఈ వెంట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆప్టర్?
By: Tupaki Desk | 19 Dec 2021 5:59 AM GMTదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన క్రేజీ ప్రాజెక్ట్ `RRR`. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు మోస్ట్ వాండెట్ మూవీగా నిలిచిన చిత్రమిది. రాజమౌళి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ అ తొలి కాంబినేషన్ లో తెలుగు, తమిళ, హిందీతో పాటు హాలీవుడ్ నటుల కలయికలో అత్యంత భారీ స్థాయిలో ప్రీ ఇండిపెండెంట్ పిరియడ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ఇటీవల విడుదవలైన ట్రైలర్‌లో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాల్లా గజ్జించిన తీరు సినిమాపై అంచనాల్ని పతాక స్థాయికి చేర్చింది. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాల జోరుపెంచారు.
ఇప్పటికే వరుస మీడియా ఇంటరాక్షన్ లతో సినిమా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న `RRR` టీమ్ ప్రీరిలిజ్ ఈవెంట్ ని అత్యంత భారీ స్థాయిలో మరింత స్పెషల్ గా వుండేలా ప్లాన్ చేశారు. అదీ ముంబైలో కావడంతో అంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా వుండబోతోందా అని చర్చించుకోవడం మొదలైంది. బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా లెవెల్లో ఈ ఈవెంట్ ని మరింత స్పెషల్ గా ప్రజెంట్ చేయాలని రాజమౌళి, మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఒకెత్తు `RRR` ఒకెత్తు అనేలా భారీ సెట్టింగులతో ఈవెంట్ ని ప్లాన్ చేస్తుండటం బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా వుంటే ఈ ఈవెంట్‌కి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఈవెంట్‌ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే స్థాయిలో ప్లాన్ చేసిన మేకర్స్ స్టేజ్ పై జరిగే కార్యక్రమాలని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేశారట. ఈ స్టేజ్ పై రామ్ చరణ్ , ఎన్టీఆర్ ప్రత్యేకంగా పెర్ఫామ్ చేసి సర్‌ప్రైజ్ చేయబోతున్నారని తాజా టాక్. ఇది ఈ ఈవెంట్ కే ప్రధాన హైలైట్ గా నిలవనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాల్సి వుంది.
`బాహుబలి` తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో `RRR`పై ఉత్తరాది ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వారిని దృష్టిలో పెట్టుకునే జక్కన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ఏర్పాటు చేశారని, ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిని గుర్తు చేయడం కోసమే ఇలా ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి స్ట్రాటజీని అంత తక్కువగా అంచనా వేయలేమని సినిమా స్థాయిని, ఫస్ట్ డే వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ ని దృష్టిలో పెట్టుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ముంబైలో ప్లాన్ చేశారని అర్థమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.