Begin typing your search above and press return to search.
దుబాయ్ ఎక్స్ పోలో RRR ఫ్యాన్స్ రచ్చ షురూ
By: Tupaki Desk | 18 March 2022 4:31 AM GMT18 మార్చి 4.30 పీఎం నుంచి దుబాయ్ ఎక్స్ పోలో రామ్ - భీమ్ అభిమానుల సందడి పీక్స్ కి చేరనుంది. అక్కడ ఫ్యాన్స్ ని ఫేవరెట్ స్టార్లు రామ్ చరణ్ - రామారావు కలుసుకోనుండడంతో ఇప్పటికే ఎంతో ఎగ్జయిట్ మెంట్ కొనసాగుతోంది. దుబాయ్ ఎక్స్ పో 2020 లో తమ అభిమానులను కలవడానికి RRR స్టార్స్
ఎన్టీఆర్- రామ్ చరణ్- దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సహా ఇతర ప్రధాన నటీనటులు విచ్చేస్తారని తెలిసింది.
RRR సినిమా అభిమానులందరికీ పిలుపునిస్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ .. ఒలివియా మోరిస్ సహా ఇతరత్రా నటీనటులు మార్చి 18న దుబాయ్ ఎక్స్ పో 2020 ని సందర్శిస్తారు.
ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పీరియాడికల్ ఫిల్మ్ ను ప్రమోట్ చేయడానికి .. అభిమానులతో ఇంటరాక్ట్ చేయడానికి ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఎక్స్ పో లో జూబ్లీ స్టేజ్ కి చేరుకుంటారు. ఎక్స్ పో ఎంట్రీ టిక్కెట్ ని కలిగి ఉంటే అరుదైన అవకాశం కలగనుంది.
1920 కాలంలో సాగే కథాంశమిది. నాటి స్వాతంత్య్ర పోరాటంలో తమ దేశం కోసం ఎంతదూరమైనా వెళ్లే ఇద్దరు విప్లవకారుల యుద్ధంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇది భారతీయ పురాణాల మిక్స్ డ్ వెర్షన్. భారతీయ సూపర్ హీరో జానపద కథలు .. మంచి వర్సెస్ చెడు థీమ్ లు హైలైట్ గా విజువలైజ్ చేసారు.
దర్శకధీరుడు రాజమౌళి నిస్సందేహంగా భారతదేశంలోని అత్యంత వినూత్నమైన సృజనాత్మక ఫిలింమేకర్స్ లో ఒకరు. అతను తన భారీ-బడ్జెట్ ఫాంటసీ సినిమాలతో సంచలనంగా మారుతున్నారు. ఆయన మాట్లాడుతూ.. "నా సినిమాలు అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ ఎమోషన్స్ పై ఎక్కువగా ఉంటాయి… కానీ నా మానసిక పరిధిలో నేను అలాంటి పెద్ద చిత్రాల వైపు ఆకర్షితుడనయ్యాను. జీవితం కంటే పెద్ద సాహసోపూరితమైన కథలను నేను ఎప్పుడూ ఇష్టపడతాను. అవి నన్ను మానసికంగా కదిలిస్తాయి. ఉత్తేజపరుస్తాయి.. నా ప్రేక్షకులకు ఆ ఎగ్జయిట్ మెంట్ ని ఇవ్వాలనుకుంటున్నాను" అని అతను చెప్పాడు.
2022లో భారతదేశం లోనే మోస్ట్ అవైటెడ్ విడుదలలలో ఒకటిగా ఆర్.ఆర్.ఆర్ గురించి చర్చ సాగుతోంది. బాలీవుడ్ స్టార్ అలియా భట్ కి కెరీర్ పరంగా మొదటి దక్షిణ భారత చిత్రమిది. ఎన్ లార్జ్ చేసిన అతిధి పాత్ర లో దేవగన్ నటన ఆకట్టుకోనుందని టాక్. ఉక్రెయిన్ -బల్గేరియాలో కొన్ని సన్నివేశాలు సహా దేశం అంతటా విస్తృతంగా చిత్రీకరించిన చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ రికార్డులకెక్కింది. మార్చి 24న యూఏఈలో ఈ చిత్రం తమిళం- హిందీ సహా పలు భాషల్లో విడుదల కానుంది.