Begin typing your search above and press return to search.

#RRR ఫైట్స్: ప్ర‌తి ప‌ది నిమిషాల‌కు సీట్ అంచుకు జారాల్సిందే!

By:  Tupaki Desk   |   7 Aug 2021 1:30 PM GMT
#RRR ఫైట్స్: ప్ర‌తి ప‌ది నిమిషాల‌కు సీట్ అంచుకు జారాల్సిందే!
X
సినిమాలో సంద‌ర్భోచితంగా పోరాట స‌న్నివేశాలు ఉండాలి. ఇరికించిన‌ట్టుగా కాకుండా క‌థ‌లో ఇమిడిపోవాలి. అప్పుడే ఆడియెన్ ఫైట్ సీక్వెన్సుల్ని కూడా ఆస్వాధించ‌గ‌ల‌రు. కెరీర్ తొలి నాళ్ల నుంచి ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌తో పాటు వ‌చ్చే పోరాట స‌న్నివేశాల‌ను మ‌ల‌చ‌డంలో ఎస్.ఎస్.రాజ‌మౌళి శైలి చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. థియేట‌ర్ల‌లో ఆడియెన్ లో ఎమోష‌న్ గ్రాఫ్ ని పెంచే టెక్నిక్ లో స్పెష‌లిస్ట్. పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కిన‌ బాహుబ‌లి ఫ్రాంఛైజీలో యాక్ష‌న్ స‌న్నివేశాల్ని సముచితంగా తెర‌కెక్కించి శ‌భాష్ అనిపించారు.

మొద‌టి 20నిమిషాల్లో ఆడియెన్ ని క‌థ‌లోకి దించేశాక ఇక ప్ర‌తి ప‌ది నిమిషాల‌కు ఒక ఛ‌మ‌క్కు ఏదో ఒక‌టి చూపించాలి. కానీ ఈసారి RRRలో ప్ర‌తి 10 నిమిషాలకు ఒక థ్రిల్లింగ్ ఫైట్ సీక్వెన్స్ ని తెర‌పై చూపిస్తున్నార‌ని తెలిసింది. ప‌ది సీక్వెన్సుల్లో క్లైమాక్స్ ఇంట‌ర్వెల్ ఫైట్ సీన్స్ తో పాటు ఇందులో చెప్పుకోద‌గ్గ పోరాట స‌న్నివేశాలు ఉంటాయ‌ని తెలిసింది. గ‌గ‌ర్పొడిచే భీక‌ర‌మైన పోరాట స‌న్నివేశాలు వాటిలో కూడా టెక్నిక‌ల్ ఫైట్స్ అల‌రిస్తాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సిపాయిల‌పై తిరుగుబాటు .. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల ఎలివేష‌న్ ప్ర‌ధానంగా హైలైట్ గా ఉండ‌నున్నాయి.

RRR యూనిట్ ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ -తారక్ లపై ఒక ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. జార్జియాలోని పలు ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత యూనిట్ 20 ఆగస్టు నాటికి హైదరాబాద్ కు తిరిగి వచ్చేస్తుంది. ఫైట్స్ తో పాటు పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లోనూ రాజ‌మౌళి ఎక్క‌డా రాజీకి రావ‌డం లేదు. ఆర్.ఆర్.ఆర్ లో భ‌న్సాలీ రేంజులో సెట్స్ ఎలివేష‌న్ కూడా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఫైట్స్ లో హాలీవుడ్ స్టాండార్డ్స్:

ఫైట్స్ లేదా యాక్ష‌న్ సీక్వెన్సుల‌ను తెర‌కెక్కించే విధానం ఒక‌ప్ప‌టి తో పోలిస్తే ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు హాలీవుడ్ స్టాండార్డ్స్ ని ఎలివేట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఫైట్స్ రూపురేఖ‌లు పూర్తిగా మారాయి. యాక్ష‌న్ సీక్వెన్సులు ఎంతో అర్థ‌వంతంగా క‌నిపిస్తున్నాయి. లాజిక్ పూర్తిగా మిస్స‌వ్వ‌డం లేదు. ఇక‌పోతే ఎస్‌.ఎస్.రాజ‌మౌళి ఒక యాక్ష‌న్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్నారు అంటే అందులో భారీ ఎమోష‌న్ ని ర‌గిలించ‌డంలో మహా దిట్ట‌. ఇంత‌కుముందు ఛ‌త్ర‌ప‌తి .. విక్ర‌మార్కుడులో అలాంటి ఎమోష‌న్స్ చూశాం. ర‌గ్భీ నేప‌థ్యంలోని సై సినిమాలోనూ ఎమోష‌న్స్ గ్రాఫ్‌ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. బాహుబ‌లి ప‌తాక స‌న్నివేశాల్లో అలాంటి ఎమోష‌న్ ర‌గిలించ‌డంలో అత‌డు త‌న ప‌నిత‌నాన్ని చూపించారు. ఏ చిన్న ఫైట్ వ‌చ్చినా దానికి అనుబంధంగా ఎమోష‌న్ అంతే ప్ర‌భావ‌వంతంగా డిజైన్ చేయ‌డంలో జ‌క్క‌న్న సూప‌ర్భ్ అని నిరూపించారు.

ఇప్పుడు RRR విష‌యంలోనూ ఆయ‌న ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఈ చిత్రంలో ప్ర‌తి పోరాట స‌న్నివేశం సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటాయ‌ని ఇదివ‌ర‌కూ విజ‌యేంద్ర ప్రసాద్ .. డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా యాక్ష‌న్ లోనే ఎమోష‌న్ ఉంటుంద‌ని తెలిపారు.

``ప్ర‌తి పోరాట సన్నివేశం ఏదో గొడవప‌డ‌డం లాంటిది కాదు. ఆర్‌.ఆర్‌.ఆర్ లో పోరాట సన్నివేశం చాలా ఉద్వేగభరితమైనది.. ఇది చ‌క్క‌ని కథను చెబుతుంది. కన్నీళ్లు పెట్టుకునేంత‌గా ఎమోష‌న్ ని ర‌గిలిస్తుంది. ఆర్‌.ఆర్‌.ఆర్ పోరాట సన్నివేశం గొప్పతనం అది`` అని రచయిత సాయి మాధ‌వ్ చెప్పారు. అతను RRR లో చిన్న భాగాన్ని చూశానని ఇది అసాధారణంగా ఉంద‌ని తెలిపారు. జ‌క్క‌న్న ఆర్.ఆర్.ఆర్ కోసం ది బెస్ట్ గా ప్ర‌య‌త్నించారు... అని అన్నారు. ప్ర‌తి ఫైట్ సీక్వెన్స్ వెన‌క అర్థం ప‌ర‌మార్థం ఉండేలా రాజ‌మౌళి తీర్చిదిద్దుతున్నార‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ వెల్ల‌డించారు.