Begin typing your search above and press return to search.
ఫలిస్తున్న ఎన్టీఆర్ - చరణ్ ల కష్టం!
By: Tupaki Desk | 6 Dec 2022 5:30 PM GMTపాన్ ఇండియా సినిమాల దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుని హాలీవుడ్ టెక్నీషియన్స్ ని సైతం ఆకట్టుకుంటున్న రాజమౌళి ఏ ముహూర్తాన 'నాటు నాటు' పాటని 'RRR' కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లపై పెట్టాలనుకున్నాడో తెలియదు కానీ తన ఆలోచనకు కారణం ఏంటన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ 'RRR'. ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. టాలీవుడ్ లో వున్న మెస్ట్ డ్యాన్సర్ లలో ప్రధమంగా వీరి పేరే వినిపిస్తుంటుంది.
అలాంటి స్టార్ ల డ్యాన్సింగ్ స్కిల్ ని, తెలుగు వాటి నాటు డ్యాన్స్ ని యావత్ ప్రపంచానికి జక్కన్న చూపించి మెస్మరైజ్ చేయాలనుకున్నాడో ఏమో కానీ 'RRR' కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లపై చిత్రీకరించిన 'నాటు నాటు' సాంగ్ హాలీవుడ్ స్థాయిలో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు లు సృష్టించింది. థియేటర్లలో ప్రపంచ సినీ ప్రియులు స్టెప్పులేసేలా చేసింది.
దేశీయ నాటు అంటూ చరణ్, ఎన్టీఆర్ ఈ పాటకు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తమదైన జోష్ ని చూపిస్తూ నాన్ స్టాప్ గా కళ్లని లయబద్దంగా కదిలిస్తూ వీరిద్దరు చేసిన డ్యాన్స్ ఇప్పడు వరల్డ్ వైడ్ గా వండర్స్ ని క్రియేట్ చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలకబోతోంది.
మెగా నందమూరి ఫ్యాన్స్ కే కాకుండా యావత్ ఇండియన్ ఆడియన్స్ కి హాట్ ఫేవరేట్ సాంగ్ గా నిలిచింది. కీరవాణి తనదైన స్టైల్ లో సంగీతాన్ని అందించగా కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. నాటు సాంగ్స్ కి బెంచ్ మార్క్ సాంగ్ గా రికార్డుల కెక్కిన ఈ సాంగ్ హాలీవుడ్ సినీ ప్రియుల్ని కూడా ఆకట్టుకుంది.
వరల్డ్ వైడ్ గా సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించిన ఈ పాట కోసం చరణ్, ఎన్టీఆర్ పడిన కష్టం ఫలితంచేలా కనిపిస్తోంది. ఈ పాటతో 'RRR' కు ఆస్కార్ ని అందించేలా వండర్స్ క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో ఆస్కార్ ఇండియాని వరించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఊహాగానాలని నిజం చేస్తూ తాజాగా 'హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సీనియర్ అవార్డ్ కాలమిస్ట్ స్కాట్ ఫీన్బర్గ్ అంచనా ప్రకారం 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ గెలిచే అవకాశం వుందని తెలుస్తోంది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'నాటు నాటు' సాంగ్ కి ఆస్కార్ అవార్డ్ వస్తుందని 'స్కాట్ ఫీన్బర్గ్ జాతకం చెప్పారు. స్కాట్ ప్రిడిక్షన్ నూటికి నూరు శాతం నిజమయ్యే అవకాశాలే అత్యధికంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ ని ఇండియాకు తీసుకురావడం ఖాయం. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలోనే కాకుండా బెస్ట్ పిక్చర్ కేటగిరిలో నిలవబోయే సినిమాలకు 'RRR' గట్టి పోటీనిచ్చే అవకాశం కూడా వుందని స్కాట్ చెప్పడం గమనార్హం. దీంతో 'RRR' హాలీవుడ్ సత్తా చాటడం ఖాయం అని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.