Begin typing your search above and press return to search.
#RRR ఫైనాన్స్.. ఎవరా బిగ్ షాట్?
By: Tupaki Desk | 24 Jan 2020 9:25 AM GMT#RRR చిత్రాన్ని దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే టాలీవుడ్ టాప్ స్టార్లు ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ఆలియా- ఒలీవియా కథనాయికలుగా నటిస్తున్నారు. డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బడ్జెట్ 350 కోట్లు పైమాటేనని ప్రచారం సాగుతోంది. స్లీపింగ్ పార్టనర్స్ గా రాజమౌళి- రామ్ చరణ్ కూడా పెట్టుబడులు పెడుతున్నారని ప్రచారమవుతోంది. అయితే అంత పెద్ద బడ్జెట్ ని మొత్తం ఈ ముగ్గురే పెట్టారా? లేక పైనాన్స్ ఇచ్చే బిగ్ షాట్ ఇంకెవరైనా ఉన్నారా? అంటూ ఆరాలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. ఓ బడా పారిశ్రామిక వేత్త పేరు తెరపైకి వచ్చింది.
గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి వెనుక బిగ్ షాట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అలానే పాన్ ఇండియా ఆర్.ఆర్.ఆర్ వెనుక ఓ పెద్ద వ్యాపారవేత్త చక్రం తిప్పుతున్నారని... దీని వెనక ఫైనాన్షియర్ గా ఉన్నారని తెలుస్తోంది. ఆయన ఓ టీవీ చానెల్ వోనర్ కం పారిశ్రామికవేత్త అని ప్రచారమవుతోంది. తెరముందు దానయ్య ఉన్నా.. తెర వెనుక పైనాన్స్ మ్యాటర్స్ ఆయనే సెట్ చేస్తున్నారట. అయితే దర్శకధీరుడిపై నమ్మకంతోనే ఆయన ఈ డేర్ స్టెప్ తీసుకున్నారని చెబుతున్నారు. పైనాన్స్ ఇచ్చే ముందు రకరకాల కండిషన్స్ తో అగ్రిమెంట్ రాసుకున్నారన్న మాటా వినిపిస్తోంది.
ఆర్.ఆర్.ఆర్ విజయం సాధిస్తే మేజర్ షేర్ రాజమౌళి కి సదరు ఫైనాన్షియర్ కే చెందుతుందట. సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ మొత్తం రాజమౌళి తనయుడు కార్తికేయ చూసుకుంటున్నారట. ఆంధ్రా మార్కెట్ నుంచి ఇప్పటికే 100 కోట్ల మేర డిమాండ్ ఉందని ప్రచారంలో ఉంది. అయినా జక్కన్న ప్రోడక్ట్ కాబట్టి పోటీ కూడా గట్టిగానే ఉంటుంది. పాన్ ఇండియా కేటగిరీ సినిమా.. పైగా సక్సెస్ ఫుల్ దర్శకుడు కాబట్టి ఓపెనింగ్ వసూళ్లకు తిరుగుండదని అంచనా వేస్తున్నారు. దాదాపు 600-700 కోట్ల సునాయాస వసూళ్ల టార్గెట్ ని నిర్ణయించి ఆర్.ఆర్.ఆర్ మార్కెటింగ్ చేస్తున్నారని చెబుతున్నారు.