Begin typing your search above and press return to search.

#RRR టైటిల్ ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా?

By:  Tupaki Desk   |   1 March 2020 6:19 AM GMT
#RRR టైటిల్ ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా?
X
#RRR టైటిల్ గురించి జ‌క్క‌న్న టీమ్ ఏళ్ల‌కు ఏళ్లు నాన్చేస్తుంటే అభిమానులు తీవ్ర అసంతృప్తికి గుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ పాన్ ఇండియా సినిమాకి సంబంధించిన టైటిల్ విష‌యంలో ఎందుకింత డైల‌మా? అంటూ తార‌క్ - రామ్ చ‌ర‌ణ్ అభిమానుల్లో ఇప్ప‌టికే అస‌హ‌నం వ్య‌క్త‌మైంది.

`రామ రావ‌ణ రాజ్యం` టైటిల్ ఫైన‌ల్ అయ్యిందంటూ అప్ప‌ట్లో ప్ర‌చార‌మైనా.. అది టైటిల్ కాద‌ని తేలిపోయింది. ఆ త‌ర్వాత ఆ టైటిల్ ని వేరే నిర్మాత‌లు లాక్ చేసి అప్పుడే సినిమా కూడా చేసేస్తున్నారు. అయితే రాజ‌మౌళి మైండ్ లో ఏ టైటిల్ ఉంది? అంటే.. తాజాగా `ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ టైటిల్ ని ప్ర‌క‌టించేందుకు టీమ్ రెడీ అవుతోంది.

అయితే ఈ టైటిల్ నే ఎందుకు ఎంపిక చేశారు? అంటే దీనికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. స్వాతంత్య్ర స‌మ‌రంలో ఈ పోయెమ్ ఎంతో ఫేమ‌స్. మ‌హాత్మా గాంధీజీ దీనిని ఎంతో పాపుల‌ర్ చేశారు. ఉద్య‌మంలోనూ కీల‌క భూమిక పోషించింది. తెలుగు- త‌మిళం- హిందీ అనే తేడా లేకుండా జాతీయ స్థాయిలో ప్ర‌జ‌లంతా వెంట‌నే గుర్తిస్తారు. అందుకే ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం అనే టైటిల్ ని ఫిక్స్ చేశార‌ట‌. ఇక దీనికి ఆర్.ఆర్.ఆర్ అనేది స‌బ్ టైటిల్. ప్ర‌ధాన టైటిల్ లోగోకి దిగువ‌న ఇది క‌నిపిస్తుంది. ఇక దేశ‌వ్యాప్తంగా ఈ టైటిల్ ఫిక్స్ అనుకుంటే... అంత‌ర్జాతీయ మార్కెట్లో మాత్రం ఆర్.ఆర్.ఆర్ టైటిల్ తోనే రిలీజ‌వుతుంది. దానికి కింద ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం ఉప‌శీర్షిక‌గా క‌నిపిస్తుంది. ట్రిపుల్ ఆర్ టైటిల్ కి అంత‌ర్జాతీయంగా మంచి ఐడెంటిటీ ద‌క్కింది కాబ‌ట్టి అది ప్ల‌స్ కానుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని జ‌పాన్- కొరియా- మ‌లేషియా స‌హా ప్ర‌పంచ దేశాల్లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు కాబ‌ట్టి ఆ మేర‌కు టైటిల్ కి చాలా ప్రాధాన్య‌త ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.