Begin typing your search above and press return to search.
'ఆర్‌ఆర్‌ఆర్' కి మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
By: Tupaki Desk | 29 Oct 2022 7:42 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దేశంలో భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా కు దక్కిన ప్రశంసలు మరియు గౌరవం గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆస్కార్ లెవల్ లో సినిమా ఉందంటూ చాలా మంది అంతర్జాతీయ మీడియా వారు పేర్కొన్నారు.
విదేశీ మీడియా సంస్థలు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గురించి ఒక ఇజ్రాయిల్ మీడియా సంస్థ అత్యంత పాజిటివ్ గా రాసి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.
నెట్ ఫ్లిక్స్ ద్వారా దేశ విదేశాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి అంతర్జాతీయంగా టాప్ మీడియా సంస్థ అయిన ఎంపైర్ మ్యాగజైన్ లో కథనం వచ్చింది. ఎంపైర్ మ్యాగజైన్ లో రాజమౌళి యొక్క ఆర్ ఆర్ ఆర్ అనుభవాలను కథనంగా రాయడం జరిగింది.
ఒక ఇండియన్ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో ఎంపైర్ మ్యాగజైన్ లో రావడం చాలా పెద్ద విషయం గా మాట్లాడుకుంటూ ఉన్నారు. జాతీయ స్థాయిలోనే కాకుండా ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ గురించి వస్తున్న కథనాలు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినీ అభిమానులు గర్వించే విషయం అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్ లో ఇటీవల విడుదల అయ్యింది. త్వరలోనే ఆస్కార్ లో కూడా నామినేషన్స్ ను దక్కించుకున్న జక్కన్న సత్తా చాటడం ఖాయం అంటూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు చాలా బలంగా వాదిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.