Begin typing your search above and press return to search.

ఆర్ఆర్‌ఆర్‌ : వారణాసి హారతి మొదలుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వరకు

By:  Tupaki Desk   |   23 March 2022 5:55 PM GMT
ఆర్ఆర్‌ఆర్‌ : వారణాసి హారతి మొదలుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వరకు
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా మార్చి 25వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి.. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు దేశ వ్యాప్తంగా చక్కర్లు కొట్టేశారు. ఉత్తర భారతం మరియు దక్షిణ భారతం మొత్తం అన్ని చోట్ల కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పీక్స్ లో చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

వారణాసి హారతి లో పాల్గొని.. గోల్డెన్ టెంపుల్ వద్ద పూజలు.. హౌరా బ్రిడ్జీ వద్ద హడావుడి.. ఇలా ఉత్తర భారతం లో తెగ సందడి చేసిన ఆర్ ఆర్‌ ఆర్‌ టీమ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చివరగా ఈ ముగ్గురు కలిసి టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగానే ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేశారు.

మొత్తానికి జక్కన్న దాదాపు రెండు వారాల పాటు మరే సినిమా గురించి వార్తలు రాకుండా ఎక్కడ చూసినా ఆయనే కనిపించే విధంగా సినిమా ను ప్రమోట్‌ చేయడం జరిగింది. ఈ స్థాయిలో సినిమా ను ప్రమోట్ చేసిన ఘనత ఆయనకే దక్కింది. రాజమౌళి తనయుడు కార్తికేయ మొత్తం ఈ టూర్‌ ను ప్లాన్‌ చేయడం తో పాటు అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారని తెలుస్తోంది.

సినిమా కు ఇప్పటికే రావాల్సిన హైప్ భారీ గా వచ్చింది. కనుక ఇక వసూళ్ల విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మూవీగా విడుదల అయిన మొదటి రోజు వసూళ్ల తో నిలువబోతుంది అని ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ తో క్లారిటీ వచ్చేసింది. లాంగ్‌ రన్‌ లో అంతకు మించి అంటూ వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.

రామ్ చరణ్ ను అల్లూరిగా ఎన్టీఆర్‌ ను కొమురం భీమ్‌ గా చూపించబోతున్న రాజమౌళి ఆలియా భట్‌ ను ఈ సినిమా లో అత్యంత కీలక పాత్రలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అజయ్‌ దేవగన్ ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం అద్బుతం అన్నట్లుగా ఇప్పటికే పేరు దక్కించుకుంది. మరి కొన్ని గంటల్లో యూఎస్ ప్రీమియర్ లు కూడా మొదలు కాబోతున్నాయి.