Begin typing your search above and press return to search.
RRR మూవీని రెండు భాగాలుగా తీయాలనే ప్లాన్ కూడా ఉందా...?
By: Tupaki Desk | 11 Oct 2020 2:30 AM GMT'బాహుబలి'తో భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేసేలా రెడీ చేస్తున్నామని ప్రకటించారు. కానీ అనుకోని అవాంతరాలు ఏర్పడి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చివరగా 2021 జనవరి 8న సంక్రాతి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఈసారి కరోనా మహమ్మారి వచ్చి షూటింగ్ కి బ్రేక్స్ వేసి చెప్పిన డేట్ కి రాకుండా చేసింది. ఈ క్రమంలో ఏడు నెలల సమయం కూడా వృధాగా పోయింది. దీంతో ఒకానొక టైంలో రాజమౌళి ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని రెండు భాగాలుగా తీద్దామని ప్లాన్ చేసాడట.
రాజమౌళి పర్ఫెక్షన్ కోసం ఒక సినిమా తీయడానికి చాలా సమయం తీసుకుంటాడనే విషయం తెలిసిందే. 'బాహుబలి' రెండు భాగాలు తెరకెక్కించడానికి సుమారు ఐదేళ్లు టైం తీసుకున్నాడు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని సంకల్పించినా లేట్ అవుతూనే వచ్చింది. దీంతో అసలు వచ్చే ఏడాదైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు అందరిలో కలిగాయి. అయితే ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసి అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పాడు. అయితే షూటింగ్ లేట్ అవుతూ వస్తున్న కారణంగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రెండు భాగాలుగా తీసి ఫస్ట్ పార్ట్ ని 2021 సమ్మర్ కు విడుదల చేస్తే ఎలా వుంటుందని రాజమౌళి ఆలోచన చేశారట. దీని గురించి హీరోల దగ్గర కూడా డిస్కస్ చేస్తే వారిద్దరూ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారట. రెండు భాగాలుగా ప్లాన్ చేస్తే స్టోరీ దానికి తగ్గట్లు చేంజెస్ చేయాల్సి ఉంటుందని.. దాని వల్ల ఇంకా ఎక్కువ టైమ్ పడుతుందని.. అందుకే ముందుగా అనుకున్నట్లే ఒకే సినిమాగా కంప్లీట్ చేయాలని హీరోలిద్దరూ కోరారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ RRR కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం.