Begin typing your search above and press return to search.

RRR హిందీ ఆ ఐదు రికార్డులు బ్రేక్

By:  Tupaki Desk   |   3 April 2022 3:30 PM GMT
RRR హిందీ ఆ ఐదు రికార్డులు బ్రేక్
X
RRR సంచ‌ల‌నాలు ఇప్ప‌ట్లో ఆగేట్టు లేవు. ఈ సినిమా ఇంటా బ‌య‌టా దుమ్ము దులిపేస్తోంది. ముఖ్యంగా హిందీలో ఆశించిన దాని కంటే అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధిస్తూ అజేయంగా కొన‌సాగుతోంది. ముఖ్యంగా జాన్ అబ్ర‌హాం ఎటాక్ రిలీజైనా ఆ సినిమాకి ఎక్క‌డా స్కోప్ అన్న‌దే లేకుండా చేసిందంటే అతిశ‌యోక్తి కాదు. ఉత్త‌రాది ఆడియెన్ సౌత్ సినిమా మసాలా వాస‌న మ‌రిగార‌న‌డానికి ఇంత‌కంటే ఎగ్జాంపుల్ అక్క‌ర్లేదు.

RRR బాక్సాఫీస్ కలెక్షన్ 10వ రోజు అసాధార‌ణంగా ఉంద‌ని హిందీ ట్రేడ్ వెల్ల‌డించింది. ఎస్‌ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం హిందీ బెల్ట్ లో రూ.200 కోట్ల మార్కును దాటుతోంది. ఈ చిత్రం రెండవ వారాంతంలో భారీగా లాభపడింది. మార్చి 25 న విడుదలైనప్పటి నుండి ఒక వారం కంటే ఎక్కువ సమయం గడిచినా బాక్సాఫీస్ వద్ద తిరుగులేనిద‌ని నిరూపించింది. అల్లూరి సీతారాంరాజుగా రామ్ చరణ్ .. కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎక్స్‌ట్రావాగాంజా ఇది.

హిందీ బెల్ట్ లో ఈ చిత్రం ఐదు రికార్డుల్ని ఇప్ప‌టికే బ్రేక్ చేసింద‌న్న రిపోర్ట్ అందింది. నిజానికి పోస్ట్-పాండమిక్ లో ది కాశ్మీర్ ఫైల్స్ అద్భుత వ‌సూళ్ల‌తో ఆక‌ట్టుకుంది. అంత‌కుముందు సూర్యవంశీ -గంగూబాయి కతియావాడి చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను అందుకున్నాయి. కానీ ఆ కలెక్షన్ లను అధిగమించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రంగా RRR హిందీ వెర్ష‌న్ నిలిచింది. ఇటీవ‌ల రిలీజైన ఎటాక్ అయితే ఆర్.ఆర్.ఆర్ కి ద‌రిదాపుల్లో కూడా లేదు.

ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కాడెల్ ప్ర‌కారం.. బలమైన మౌత్ టాక్ తో ఆడిన చిత్ర‌మిద‌ని అన్నారు. ఈ చిత్రం దాని రెండవ వారాంతంలో బలంగా పుంజుకుందని ఏప్రిల్ 2న‌ శనివారం నాడు రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిందని ట్వీట్ చేశారు. #RRR (హిందీ) ర్యాంపేజ్ మోడ్ లో ఉంది. నిన్నటితో పోలిస్తే రెండవ శనివారం సుమారు 50 వాతం వృద్ధిని నమోదు చేసింది.. తొలి అంచనాల ప్రకారం డే-9 వసూళ్లు రూ. 20 కోట్ల నికర స్థాయిలో ఉన్నాయి.. అత్యద్భుతంగా ఉంది !! #RRRMovie.. అని ట్వీట్లో వెల్ల‌డించారు.

మరో ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇప్పటికే RRR హిందీ వెర్షన్ ఏప్రిల్ 1 శుక్రవారం వరకు రూ. 146.09 కోట్లు వసూలు చేసిందని వివ‌రాల్ని అందించారు. అతను ట్వీట్ చేస్తూ..రెండు కొత్త చిత్రాలు ఆక్రమించినప్పటికీ సినీ ప్రేక్షకుల మొదటి ఎంపిక #RRR. మార్కెట్ ప్లేస్ లో [#Attack, #Morbius... ఉన్నా ఈరోజు ₹ 150 కోట్లను దాటుతుంది... [రెండవ] శని .. ఆదివారాల్లో పెద్ద వృద్ధిని అంచనా వేస్తున్నాం... [వారం 2] శుక్ర 13.50 కోట్లు. మొత్తం: ₹ 146.09 కోట్లు. #India బిజ్ ... అంటూ వెల్ల‌డించారు.

ఈ సంకేతాలు ప‌రిశీలిస్తే.. ఈ చిత్రం రెండవ ఆదివారం అంటే ఏప్రిల్ 3న భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ను సాధించ‌నుంద‌ని అర్థ‌మైంది. ఢిల్లీ-NCR, -గుజరాత్- ఉత్తరప్రదేశ్ - ముంబై వంటి మాస్ సర్క్యూట్ లతో కూడిన హిందీ బెల్ట్ లో రూ. 200 కోట్లను అధిగమించగలదు అని చెబుతున్నారు.

ఈ చిత్రం ఇద్దరు అతిపెద్ద బాలీవుడ్ తారలు అలియా భట్ -అజయ్ దేవగన్ లను ఎంపిక చేయడం ద్వారా హిందీ మార్కెట్ లోకి తెలివిగా ప్రవేశించిందని హిందీ విశ్లేష‌కులు ప్ర‌శంసిస్తున్నారు. SS రాజమౌళి దర్శకత్వంలో రాజీ స్టార్ ఆలియా ..రామ్ చరణ్ స‌ర‌స‌న న‌టించ‌గా..సింగం స్టార్ దేవ‌గ‌న్ మ‌రో కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఆర్.ఆర్.ఆర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 800కోట్లు వ‌సూలు చేసి 1000 కోట్ల క్ల‌బ్ వైపు వ‌డి వ‌డిగా దూసుకుపోతోంది.