Begin typing your search above and press return to search.
'గంగూబాయి' ని దెబ్బేసిన 'ఆర్.ఆర్.ఆర్'
By: Tupaki Desk | 4 Oct 2021 2:30 PM GMTకరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు సానుకూలంగా మారుతుండటంతో సినీ ఇండస్ట్రీలో మళ్ళీ సందడి మొదలైంది. ఇన్నాళ్లు వాయిదా వేసుకుంటూ వచ్చిన సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ని లాక్ చేసి పెట్టుకుంటున్నాయి. అక్టోబర్ మూడో వారం నుంచి మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలు మరియు పాన్ ఇండియా చిత్రాలన్నీ వరుస పెట్టి విడుదల తేదీలను అనౌన్స్ చేస్తున్నారు. దీంతో కొన్ని క్రేజీ మూవీస్ మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా 'ఆర్.ఆర్.ఆర్' డేట్ ని ప్రకటించడంతో చాలా సినిమాల విడుదల తేదీల విషయంలో గందరగోళం ఏర్పడింది.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR చిత్రాన్ని 2022 జనవరి 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జక్కన్న సినిమాతో పోటీపడాలని ఎవరూ అనుకోరు కాబట్టి.. ఇప్పటికే విడుదల తేదీలను అనౌన్స్ చేసిన చిత్రాలన్నీ డైలమాలో పడ్డాయి. 'ఆర్.ఆర్.ఆర్' కు తమ సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ ఉండేలా చూసుకుని 'పుష్ప' కోసం మేకర్స్ డిసెంబర్ 17ను లాక్ చేసుకున్నారు. ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రాన్ని మాత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.
RRR రిలీజ్ డేట్ ఇవ్వకముందు అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన 'గంగుబాయి కథివాడి' చిత్రాన్ని వచ్చే జనవరి 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పెన్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సస్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అదే పెన్ స్టూడియోస్ దక్కించుకున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా జనవరి 7 కోసం షెడ్యూల్ చేయబడింది. రెండు చిత్రాల్లోనూ అలియా భట్ హీరోయిన్ గా నటించగా.. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. దీంతో వారి సినిమాకి వాళ్లే పోటీ అనే పరిస్థితి ఏర్పడింది.
'ఆర్ ఆర్ ఆర్' సినిమా పై యావత్ సినీ అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్రిపుల్ ఆర్ వల్లనే దసరా కు రావాల్సిన చాలా చిత్రాలు డేట్స్ ఇవ్వకుండా వేచి చూశారు. ఇప్పుడు సంక్రాంతి పండక్కి వస్తున్నామని చెప్పి మరోసారి అందరిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసారు. సాధ్యమైనంత వరకు RRR తో పోటీ పడటానికి ఏ నిర్మాతా ఇష్టపడరు. ఇక 'గంగూబాయి' 'ఆర్.ఆర్.ఆర్' సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్.. నటీనటులు ఒకరే కాబట్టి ఒకేసారి విడుదల చేయడం మీద పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఎక్కువ శాతం 'గంగూబాయి' ని జనవరి నుంచి షిఫ్ట్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.