Begin typing your search above and press return to search.

RRR : మూడు వారాల ముందే మిలియన్‌ ఏంటి భయ్యా?

By:  Tupaki Desk   |   6 March 2022 6:30 AM GMT
RRR : మూడు వారాల ముందే మిలియన్‌ ఏంటి భయ్యా?
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి సెన్షేషన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ సాధించని రికార్డులను బాహుబలి 2 సొంతం చేసుకుంది. ఆ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా కూడా ఏ ఇండియన్ మూవీ కూడా ఆ రికార్డును బ్రేక్ చేయలేక పోయింది. దాంతో రాజమౌళి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన రికార్డును తానే బద్దలు కొట్టేందుకు జక్కన్న రాజమౌళి సిద్దం అయ్యాడనిపిస్తుంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తో రాజమౌళి మరోసారి సెన్షేషన్ క్రియేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ దేశ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 25వ తారీకున భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా అప్పుడే రికార్డుల పరంపర మొదలు పెట్టింది.

ఏ సినిమాకు అయినా అడ్వాన్స్ బుకింగ్‌ అనేది కాయం. స్టార్‌ హీరోల సినిమాలకు రెండు మూడు వారాల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్‌ లు జరుగుతాయి. మూడు వారాల ముందుగా ఆర్ ఆర్‌ ఆర్‌ కు అడ్వాన్స్ బుకింగ్‌ ను మొదలు పెట్టారు. అనూహ్యంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ మిలియన్‌ డాలర్ల మార్క్ కు చేరువ అయ్యింది. విడుదలకు ఇంకా ఇరవై రోజులు ఉండగానే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో మిలియన్‌ డాలర్లను దక్కించుకోబోతుంది.

తాజాగా అడ్వాన్స్ బుకింగ్‌ ను మొదలు పెట్టిన వెంటనే యూఎస్ లో సినీ ప్రేమికులు ఎద్ద ఎత్తున బుకింగ్స్ కు సిద్దం అయ్యారు. రాజమౌళి బ్రాండ్‌ మరియు ఇద్దరు సూపర్‌ స్టార్‌ లు మరియ బాలీవుడ్‌ స్టార్స్ ఈ సినిమా లో ఉండటం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. కనుక యూఎస్ లో ప్రీమియర్ ల బుకింగ్స్ మరియు రెగ్యులర్‌ షో ల బుకింగ్స్ తో దద్దరిల్లుతోంది. ఈ శని మరియు ఆదివారాల్లో మిలియన్ డాలర్ల మార్క్ ను ఆర్‌ ఆర్‌ ఆర్‌ చేరుకోబోతుంది.

విడుదల సమయంకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాదాపుగా రెండున్నర నుండి మూడు మిలియన్‌ డాలర్లను ఈ సినిమా రాబడుతుందని.. లాంగ్‌ రన్‌ లో భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బాక్సాఫీస్ విశ్లేషకులు మరియు యూనిట్‌ సభ్యుల అంచనా మేరకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 10 మిలియన్ డాలర్లను రాబడుతుందట.

కేవలం యూఎస్ లోనే అంత భారీగా వసూళ్లు రాబడితే దేశంలో మరియు ఇతర ప్రపంచ దేశాల్లో ఏ స్థాయిలో వసూళ్లను దక్కించుకుంటుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉందంటూ ట్రేడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు అనేది జక్కన్న మూవీకి కామన్‌. కాని ఈసారి ఆ రికార్డులు ఏ స్థాయిలో ఉంటాయి అనేది ఊహకు కూడా అందడం లేదు.