Begin typing your search above and press return to search.

#RRR : అనుకున్నదే అయ్యింది, ఇంకెన్ని చూడాలో..!

By:  Tupaki Desk   |   15 March 2022 11:54 AM GMT
#RRR : అనుకున్నదే అయ్యింది, ఇంకెన్ని చూడాలో..!
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల కౌంట్ డౌన్ మొదలయ్యింది. మరో పది రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దం అయ్యింది. మార్చి 25వ తారీకున విడుదల కాబోతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ఒక్క రోజు ముందే అంటే మార్చి 24వ తారీకునే అమెరికాలో ప్రీమియర్‌ అవ్వబోతుంది. జక్కన్న సినిమా పై ఉన్న నమ్మకంతో అమెరికాలో సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

యూఎస్ లో సినీ ప్రేమికులు ఆర్ ఆర్ ఆర్‌ కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రీమియర్ షో లకు అవుతున్న అడ్వాన్స్ బుకింగ్‌ లను చూస్తుంటే అర్థం అవుతుంది. ప్రీమియర్‌ లకు అడ్వాన్స్ బుకింగ్‌ మిలియన్ డాలర్లు అయితే అదే చాలా పెద్ద విషయంగా అనుకుంటూ ఉంటారు. కాని ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల ఇంకా పది రోజులు ఉండగానే ప్రీమియర్ షో లకు ఏకంగా 1.5 మిలియన్ డాలర్లను దక్కించుకుంది.

విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక మరో మిలియన్ డాలర్లను కూడా వసూళ్లు చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలతో మరింతగా ఆసక్తి పెంచగలిగితే ఖచ్చితంగా మరో మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయించడం కష్టం ఏమీ కాదు అంటున్నారు. అదే కనుక జరిగితే ఏకంగా 2.5 మిలియన్ డాలర్లు కేవలం ప్రీమియర్ లకు అడ్వాన్స్ బుకింగ్‌ అయినట్లు అవుతుంది.

సినిమా విడుదల హడావుడి మొదలు అయినప్పటి నుండి కూడా రెండు మిలియన్ డాలర్ల ప్రీమియర్‌ షో ల అడ్వాన్స్ బుకింగ్‌ అవుతుంది అంటూ చర్చ జరుగుతూ వచ్చింది. కొందరు అంత లేదు అనుకున్నా కూడా మేము పలు సందర్బాల్లో రెండు మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ షో లకు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశాం. ఇప్పుడు అంతకు మించి అడ్వాన్స్ బుకింగ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఊహకు అందని వసూళ్లను బాహుబలి 2 దక్కించుకుంది. రాజమౌళి కూడా తన బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేయలేడు. అద్బుతాలు అన్ని సార్లు జరుగవు అని కొందరు అన్నారు. కాని పరిస్థితులు చూస్తుంటే బాహుబలి 2 ను బీట్‌ చేసే సత్తా ఈ సీత రామరాజు మరియు కొమురం భీమ్ వద్ద ఉన్నట్లుగానే అనిపిస్తుంది.

వసూళ్ల విషయంలో అనుకున్నదాని కంటే ఎక్కువగానే నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఎస్ ప్రీమియర్ ల అడ్వాన్స్ బుకింగ్‌ లో సత్తా చాటిన ఆర్ ఆర్‌ ఆర్‌ ముందు ముందు మరెన్ని రికార్డులను చూడాల్సి వస్తుందో అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్‌ ను అతి త్వరలోనే ఓపెన్‌ చేయబోతున్నారు. ఉత్తరాది బుకింగ్‌ కోసం అక్కడి జక్కన్న ఫ్యాన్స్‌ వెయిటింగ్‌. సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ లతోనే వంద కోట్లకు పైగా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.