Begin typing your search above and press return to search.

RRR సెట్లో ఐడీ కార్డ్ లు ధ‌రించిన తార‌క్-జ‌క్క‌న్న‌

By:  Tupaki Desk   |   6 Aug 2021 3:48 AM GMT
RRR సెట్లో ఐడీ కార్డ్ లు ధ‌రించిన తార‌క్-జ‌క్క‌న్న‌
X
ప్ర‌తిష్ఠాత్మ‌క పాన్ ఇండియా చిత్రం RRR అక్టోబ‌ర్ 13న విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ప్ర‌చారం ఇప్ప‌టికే దోస్తీ సాంగ్ తో మ‌రో స్థాయికి చేరుకుంది. అల్లూరి-కొమ‌రం భీమ్ స్నేహం నేప‌థ్యంలోని ఈ సినిమా థీమ్ ని ఎలివేట్ చేసే చిత్ర‌మిద‌ని దోస్తీ సాంగ్ తో అర్థ‌మైంది.

ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ ముగింపులో ఉంది. కీలక షెడ్యూల్ చిత్రీకరణ కోసం ఈ బృందం ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉంది. విదేశీ సెట్స్ లో టీమ్ క‌ఠిన నియ‌మాల‌ను పాటిస్తోంది. ప్రతి ఒక్కరికీ వారి గుర్తింపు కార్డులు ఉన్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ విష‌యాన్ని సోషల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. తాను ధ‌రించిన ఐడి కార్డ్ ని తార‌క్ చూపిస్తూ ఫోజిచ్చారిలా. ఆన్ లొకేష‌న్ నుంచి ఎన్టీఆర్ షేర్ చేసిన ఫోటోల్లో జ‌క్క‌న్న కూడా ఐడీ ధ‌రించి క‌నిపించారు. చాలా కాలం తర్వాత అతను ఐడి కార్డ్ ధరించామ‌ని తార‌క్ వెల్లడించాడు.

``నేను ఐడి కార్డ్ వేసుకుని చాలా ఏళ్లయింది! సెట్స్‌లో నా మొదటిది !!`` అని తార‌క్ వెల్ల‌డించారు. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. అలియా భట్ సీత పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. శ్రీ‌య‌- అజయ్ దేవగన్- సముద్రఖని త‌దిత‌రులు న‌టించారు. ఎంఎం.కీర‌వాణి సంగీతం అందించారు.

దోస్తీతో హైప్:

ఆర్‌.ఆర్‌.ఆర్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన‌ మొదటి పాట దోస్తీ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా అధికారికంగా విడుదలై అంత‌ర్జాలంలో దూసుకెళ్లిన సంగ‌తి తెలిసిన‌దే. ఏకకాలంలో ఐదు భాషల్లో ఆవిష్కరించ‌గా.. ఈ పాట యూట్యూబ్ లో అత్యంత వేగంగా వైర‌ల్ అయ్యింది. అత్య‌ధిక లైక్ ల‌తో దూసుకెళుతున్న గ్రేట్ సాంగ్ గా రికార్డుల‌కెక్కింది. ఈ పాట కొన్ని గంట‌ల్లోనే రికార్డ్ వ్యూస్.. లైక్ ల‌తో అద‌ర‌గొట్టింది. ప్రధాన పాత్రల మధ్య స్నేహం నేపథ్యంలో అద్భుత‌మైన లిరిక‌ల్ వ్యాల్యూతో సంగీత దర్శకుడు MM కీరవాణి అద్భుత‌మైన బాణీని స‌మ‌కూర్చారు. దోస్తీ ప్రచారంలో మ‌రో ముంద‌డుగు.

`రోర్ ఆఫ్ RRR` లిరిక‌ల్ వీడియోతో హైప్ మ‌రింత‌గా పెరిగింది. మునుముందు మ‌రిన్ని పాట‌లు.. లుక్ ల‌ను రిలీజ్ చేయ‌నున్నారు. ఆలియా- అజ‌య్ దేవ‌గ‌న్ లుక్ లు ఇంత‌కుముందు రిలీజ్ కాగా అద్భుత స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసినదే. మునుముందు ఈ సినిమాలో ఇత‌ర కీల‌క పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్ ల‌ను రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే అందాల‌ శ్రీ‌య పాత్ర‌కు సంబంధించిన సాంగ్ గ్లింప్స్ రిలీజ్ కానుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

ర‌ష్యా- ఉక్రెయిన్- రొమానియా- బ్లాక్ సీ ఏరియాల్లో రామ్ చ‌ర‌ణ్- అలియా భ‌ట్ పై ఓ పాట చిత్రీక‌రించారు. అలాగే హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ పూర్త‌యితే త‌దుప‌రి పూర్తి స్థాయి నిర్మాణానంత‌ర ప‌నుల్లోకి దిగిపోనున్నారు జక్క‌న్న‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ ఆర్.ఆర్.ఆర్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. అక్టోబ‌ర్ లో ఈ సినిమా చెప్పిన షెడ్యూల్ కే రిలీజ‌వుతుంద‌ని టీమ్ న‌మ్మ‌కంగా ఉంది.