Begin typing your search above and press return to search.

3డీ - ఐమాక్స్ ఫార్మాట్ లో RRR..!

By:  Tupaki Desk   |   10 Dec 2021 5:33 AM GMT
3డీ - ఐమాక్స్ ఫార్మాట్ లో RRR..!
X
'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి.. ''ఆర్.ఆర్.ఆర్'' వంటి విజువల్ వండర్ ని తెర మీద ఆవిష్కరిస్తున్నారు. దీని కోసం ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు.

మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పిలవబడే జక్కన్న.. తన సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకు వస్తుంటారు. ఇప్పుడు RRR చిత్రాన్ని కూడా స్పెషల్ ప్లాన్స్ తో ప్రమోట్ చేస్తూ భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు. ఇందులో భాగంగా గురువారం ట్రైలర్ ను లాంచ్ చేశారు.

ముందుగా దేశవ్యాప్తంగా పలు థియేటర్లతో.. ఆ తర్వాత యూట్యూబ్ లో RRR ట్రైలర్ ను విడుదల చేశారు. 3.07 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినీ అభిమానులను మెస్మరైజ్ చేసింది. చరణ్ - తారక్ లను స్క్రీన్ మీద చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' ట్రైలర్ తో పాటుగా మేకర్స్ ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే ఈ చిత్రాన్ని 3డీ - ఐమాక్స్ - డాల్బీ సినిమాలో విడుదల చేయనున్నట్టు సైలెంటుగా వెల్లడించారు. ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ లో కానీ.. ఇంటర్వ్యూలలో ప్రెస్ మీటింగ్స్ లో కానీ చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించలేదు.

'ఆర్.ఆర్.ఆర్' ట్రైలర్ చివర్లో 3డీ - ఐమాక్స్ - డాల్బీ లలో ఈ చిత్రాన్ని ఎక్స్ పీరియన్స్ చేయమని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ''జనవరి 7న సినిమా అధికారిక గూస్‌ బంప్స్ డేగా జరుపుకుంటారు. మీరు RRR సినిమాని చేయాలనుకుంటున్న ఉత్తమమైన ఫార్మాట్‌ లో ఎక్స్ పీరియన్స్ చేయండి'' అని ట్రిపుల్ ఆర్ టీమ్ ట్వీట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా సినీ అభిమానులకు ఖచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. RRR ట్రైలర్ ను చూసి ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చేసారు. మరి థియేటర్లలో RRR బీభత్సం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

కాగా, మహావీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.