Begin typing your search above and press return to search.

మ‌రో వివాదంలో ట్రిపుల్ ఆర్ ? స‌మ్మె ఎఫెక్ట్ !

By:  Tupaki Desk   |   27 March 2022 4:30 PM GMT
మ‌రో వివాదంలో ట్రిపుల్ ఆర్ ? స‌మ్మె ఎఫెక్ట్ !
X
అనూహ్య రీతిలో సంచ‌నాలు సృష్టిస్తూ, రికార్డులు న‌మోదు చేస్తూ దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగానూ ఇవాళ ట్రిపుల్ ఆర్ మంచి ఫ‌లితాలే అందుకుంది. ఆర్థికంగా మంచి లాభాలే పొందింది. సినిమాకు సంబంధించి వివిధ విష‌యాలు వివాదాల‌కు తావిచ్చేందుకు ఆస్కారం ఇస్తున్నా కూడా ట్రిపుల్ ఆర్ క‌లెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

రివ్యూల‌తో ప‌ని లేకుండా కేవ‌లం రాజ‌మౌళి పై ఉన్న న‌మ్మ‌కంతో పాటు త‌మ అభిమాన హీరోల‌ను ఒకే సినిమాలో చూడాల‌న్న ఆరాటం కార‌ణంగా వారాంతంలో మంచి డ‌బ్బుల‌నే రాబ‌ట్టేందుకు అవ‌కాశాలు కూడా ఉన్నాయి. టాక్ తో సంబంధం లేకుండా సినిమా వ‌సూళ్లన్న‌వి ఇంత రేంజ్ లో ఉండ‌డం ఇదే తొలిసారి కూడా ! ఈ ద‌శ‌లో రాజ‌మౌళితో పాటు ప‌లువురు చిత్ర బృంద స‌భ్యులను చాలా మంది అభినందిస్తున్నారు.

కొన్ని రాళ్లు కొన్ని పూలు
క‌లిస్తే ట్రిపుల్ ఆర్ ....
క‌ల‌హిస్తే ట్రిపుల్ ఆర్...

ఇదే సంద‌ర్భంలో వివేక్ ఒబెరాయ్ లాంటి వారు కొన్ని రాళ్లు సైతం విసురుతున్నారు. రామ్ చ‌ర‌ణ్ మ‌రియు తారక్ అభిమానుల మ‌ధ్య వివాదం రేపేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇలాంటి సంద‌ర్భంలో కూడా చిత్ర యూనిట్ సంయమ‌నం తోనే ఉంది. ఆర్జీవీ కూడా అర్థం అయి కాని విధంగానే ట్వీట్ చేశాడు. బాహుబ‌లి హిస్టరీ అయితే ట్రిపుల్ ఆర్ హిస్టారిక‌ల్ అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఇవన్నీ పాజిటివ్ గానో లేదా నెగెటివ్ గానో సాగుతుండ‌గానే మ‌రో ఉప‌ద్ర‌వం సినిమా బృందానికి స‌మ్మె రూపంలో ప‌ల‌క‌రించ‌నుంది.

ఎలా అంటే ? ఎందుకంటే ? క‌లెక్ష‌న్ల సునామీకి బ్రేక్ కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రేప‌టి నుంచి రెండు రోజుల పాటు స‌మ్మె చేసేందుకు క‌మ్యూనిస్టు పార్టీలు స‌న్న‌ద్ధం అవుతున్నాయి. మార్చి 28 మరియు 29 తేదీల‌లో స‌మ్మె చేసేందుకు సిద్ధం అవుతూనే ఇంకొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది.

ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణను వ్య‌తిరేకిస్తూ విశాఖ జిల్లా బంద్ ను మార్చి 28 న చేప‌ట్టేందుకు పిలుపు నిచ్చింది. బంద్ కార‌ణంగా రోజుకు మూడు షోలు మాత్ర‌మే వేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌త్యేక షో కు అనుమ‌తి కూడా ఉండ‌ద‌ని తెలుస్తోంది. అంటే ఈ బంద్ ఎఫెక్ట్ కానీ లేదా స‌మ్మె ఎఫెక్ట్ కానీ ట్రిపుల్ ఆర్ సినిమా పై ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది.

మ‌రోవైపు బంద్ త‌ల‌పెట్టే రోజు పూర్తిగా రోజంతా థియేట‌ర్లు మూసి వేయాలా లేదా కొన్ని షోల‌కు మాత్ర‌మే అనుమ‌తి పొంది న‌డుపుకోవాలా అన్నదానిపై ఇంకా థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు క్లారిఫికేష‌న్ లేదు.