Begin typing your search above and press return to search.

RRR జపాన్ కలెక్షన్స్.. టాప్ 5లో లేనట్లే!

By:  Tupaki Desk   |   30 Oct 2022 10:30 AM GMT
RRR జపాన్ కలెక్షన్స్.. టాప్ 5లో లేనట్లే!
X
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఇరు వర్గాల ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా చాలామంది ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది. ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసిన తర్వాత ప్రశంసలు కురిపించారు.

భాషా భేదం లేకుండా RRR సినిమా దేశ విదేశాలు దాటి సరికొత్త సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. ఇక పలు విదేశాల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇటీవల జపాన్లో కూడా విడుదల చేసిన విషయం తెలిసింది. ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు రాజమౌళి కూడా అక్కడ ప్రమోషన్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎందుకంటే గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాకు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈసారి రెగ్యులర్ ప్రమోషన్స్ తరహాలోనే అక్కడ కూడా సినిమాను విడుదల చేశారు. ఇక ఫస్ట్ వీక్ లో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే అందుకుంది. కానీ గత పాత రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. జపనీస్ లో అత్యధికంగా రజనీకాంత్ ముత్తు సినిమా 400M జపనీస్ యెన్ లను రాబట్టి జపాన్లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది.

ఇక ఆ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయడం ఎవరి వల్ల సాధ్య పడడం లేదు. ఇక బాహుబలి ఫుల్ కలెక్షన్స్ 300 మిలియన్ల జపనీస్ యెన్ లను రాబట్టింది ఇక ఆ తర్వాత బాలీవుడ్ మూవీ 3 ఇడియట్ 170 మిలియన్ జపనీస్ యెన్ లను అందుకుంది. శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా కూడా 130 మిలియన్ జపనీస్ యెన్ లను రాబట్టింది. ఇక చివరిగా ప్రభాస్ నటించిన సాహో సినిమా జపాన్లో 110 మిలియన్ జపనీస్ యెన్ లను అందుకుంది. ఇక ఇప్పుడు RRR సినిమా ఒక వారంలోనే 73 మిలియన్ జపనీస్ యెన్ లను సాధించింది. ఇక ఈ సినిమా 100 మిలియన్ జపనీస్ యెన్ లను అందుకుంటుందా లేదా అనేది కాస్త అనుమానంగానే ఉంది.