Begin typing your search above and press return to search.
వంద మిలియన్ క్లబ్ లో 'ఆర్ఆర్ఆర్'
By: Tupaki Desk | 15 Dec 2021 4:35 PM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతికి వారం ముందుగానే విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ట్రైలర్ విజువల్ వండర్ అన్నట్లుగా ఉంది. సినిమా ను మరో లెవల్ లో రాజమౌళి చూపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. ట్రైలర్ లో అన్ని రకాల ఎమోషన్స్ మరియు అద్బుతమైన యాక్షన్ సీక్వెన్స్ ను చూపించాడు. దాంతో ట్రైలర్ ను ఒకొక్కరు పదుల సార్లు చూస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు వంద మిలియన్ ల వ్యూస్ దక్కాయి. తెలుగు తో పాటు అన్ని సౌత్ భాషల్లో మరియు హిందీలో కూడా ఈ ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.
ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ అన్ని భాషల వర్షన్ లు కలిసి వంద మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇంత తక్కువ సమయంలో ఇంత తక్కువ సమయంలోనే వంద మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ కేవలం యూట్యూబ్ లోనే కాకుండా ఇంకా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల్లో కూడా ఉంది. అవన్నీ కూడా లెక్కిస్తే మరో పాతిక మిలియన్ ల వ్యూస్ వరకు ఉంటాయి అనడంలో సందేహం లేదు. సినిమాకు ఉన్న హైప్ ను రెట్టింపు చేసే విధంగా ఉన్న ట్రైలర్ కు రికార్డు స్థాయిలో లైక్స్ ను కూడా దక్కించుకుంటుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రైలర్ కు వ్యూస్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.
జనవరి 7వ తారీకున విడుదల కాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రలతో ఒక అద్బుతమైన స్నేహంకు సంబంధించిన కథను దర్శకుడు రాజమౌళి చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. స్వాతంత్ర్య ఉద్యమం కు సంబంధించి ఇందులో ఎలాంటి సన్నివేశాలు ఉండవట. కాని సినిమా బ్యాక్ డ్రాప్ లో మాత్రం స్వాతంత్ర్య ఉద్యమం ఉంటుందని అంటున్నారు. కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే మంచి ఆధరణ దక్కించుకున్నాయి. సినిమా కు ఆయన అందించిన బీజీఎమ్ అద్బుతంగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. సినిమా బాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.