Begin typing your search above and press return to search.

నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్న ''వైన్ షాప్ లో ఆర్ఆర్ఆర్

By:  Tupaki Desk   |   3 April 2022 12:30 PM GMT
నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్న వైన్ షాప్ లో ఆర్ఆర్ఆర్
X
కొత్త సినిమా వస్తుందన్నా లేదా కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ ను అందులో పరిచయం చేసిన మీమ్ మేకర్స్ మీమ్స్ తో మ్యాజిక్ చేస్తుంటారు. అయితే వినూత్న రితీలో అద్భుతమైన మీమ్స్ ను రూపొందించేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. పనెటిజెన్లు కూడా వాటిని చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. రీల్స్ కంటే కూడా మీమ్స్ నే ఎక్కువ ఫాలో అవుతున్నారు ఇప్పటి జెనరేషన్. అయితే ఇటీవల మీమర్స్ క్రియేట్ చేసిన కొన్ని మీమ్స్ వల్ల చూపరులు విపరీతంగా నవ్వుకుంటున్నారు.

అయితే అంతలా నవ్విస్తున్న ఆ మీమ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించింది. అలాంటి సినిమా మీమ్ ను చూసి ఎలా నవ్వుతున్నారనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అయితే అది దేనికి సంబంధించింది, ఎందుకంత నవ్విస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

క్రియేటివిటీ కల్గిన కొంత మంది మీమర్స్ వైన్ షాప్ లో ఆర్ఆర్ఆర్ ఎలా జరుగుతుందనే అంశం గురించి వివరించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రం చూసిన వారికి రాజమౌళి ది ఫైర్, ది వాటర్ క్యారెక్టర్ల కలయికను ప్రదర్శించడం ద్వారా సినిమాను ఎలా వివరించారో తెలిసిందే. అదే ఇదే కాన్సెప్ట్ తో ఓ వీడియోను రూపొందించాడు ఓ మీమర్.

ముందుగా వైన్ షాప్ లో ఓ వ్యక్తి ఓ టేబుల్ పై కూర్చుంటాడు. గ్లాసులో మందు పోస్కొని.. నీళ్ల బాటిల్ తీస్తాడు. కానీ అప్పటికే అందులోని నీళ్లు అయిపోతాయి. చుక్క కూడా రాదు. అలాగే ఇంకో టేబుల్ పై కూర్చున్న మరో వ్యక్తి సిగరెట్ తాగాలనుకుంటాడు. తీసి నోట్లో పెట్టుకుంటాడు. కానీ వెలిగేంచేందుకు ఆతడి వద్ద లైటర్ ఉండదు.

అయితే వారిద్దరూ ఒకరినొకరు గమనించుకొని పలకరించుకుంటారు. ఒకరి దగ్గర ఉన్న నీళ్లను మరొకరికి ఇచ్చి అతడి వద్దనున్న మంటను అతను తీస్కుంటాడు. ఇలా ఈ వీడియోను పూర్తి చేశాడు మీమర్. అయితే ఇది చూసిన వారంతా కడుపుబ్బా నవ్వుతున్నారు.

అయితే ఈ మీమ్ చూసిన వాళ్లంతా ఇది చాలా క్రేజీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అందర్నీ ఆకట్టుకుంటుండడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తమ వస్తువులను మార్కెట్ లోకి పంపేటప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్లు ఈ లెవెల్లోనో తమ వీడియోలను తయారు చేసేవారు. అయితే ఈ ఫన్నీ మీమ్ కూడా అదే రేంజ్ లో ఉందంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి మరెన్నో మీమ్స్ ను తనకు అందించాలంటూ మీమర్స్ కు చెబుతున్నారు.