Begin typing your search above and press return to search.
ఆస్కార్ రేసులోకి RRR.. 15 విభాగాల్లో నామినేషన్..!
By: Tupaki Desk | 6 Oct 2022 5:15 AM GMTఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్'' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అలాంటి ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ రేసులోకి ఎంట్రీ ఇస్తోంది.
RRR సినిమా ఓటీటీలో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత.. ఈసారి కచ్చితంగా ఆస్కార్ బరిలో నిలుస్తుందని అందరూ భావించారు. హాలీవుడ్ మ్యాగజైన్స్ సైతం ట్రిపుల్ ఆర్ మూవీకి అవార్డ్స్ గ్యారంటీ అని అభిప్రాయ పడుతూ నివేదికలు ఇచ్చాయి. అయితే ఈ చిత్రాన్ని మనదేశం తరపున ఆస్కార్ కు అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక చేయలేదు. దీంతో సినీ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం లేటెస్టుగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రాబోయే ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేషన్స్ కు పంపుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫర్ యువర్ కన్సిడరేషన్ (FYC) కింద మొత్తం 15 క్యాటగిరీలలో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
*RRR మూవీ కింది విభాగాల్లో ఆస్కార్ నామినేషన్ల కోసం ప్రచారం చేయబడుతోంది.
1. బెస్ట్ మోషన్ పిక్చర్ - డీవీవీ దానయ్య
2. బెస్ట్ డైరెక్టర్ (ఎస్ఎస్ రాజమౌళి)
3. బెస్ట్ యాక్టర్ (ఎన్టీఆర్ & రామ్ చరణ్)
4. ఉత్తమ సహాయ నటి (అలియా భట్)
5. ఉత్తమ సహాయక నటుడు (అజయ్ దేవగన్)
6. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - (విజయేంద్ర ప్రసాద్ & రాజమౌళి)
7. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (ఎంఎం కీరవాణి)
8. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ('నాటు నాటు')
9. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ (ఎ. శ్రీకర్ ప్రసాద్)
10. బెస్ట్ సౌండ్ (రాఘునాథ్ కెమిసెట్టి - బోలోయ్ కుమార్ డోలోయి - రాహుల్ కార్పే)
11. బెస్ట్ సినిమాటోగ్రఫీ (కె. కె. సెంథిల్ కుమార్)
12. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్)
13. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (రమా రాజమౌళి)
14. బెస్ట్ మేకప్ & హెయిర్ స్టైలింగ్ (నల్లా శ్రీను - సేనాపతి నాయుడు)
15. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (వి. శ్రీనివాస్ మోహన్)
భారతదేశం తరపున ఆస్కార్ నామినేషన్ల కోసం RRR ఎంపిక కాకపోయినా.. గ్లోబల్ ప్రశంసలు మరియు అభిమానుల డిమాండ్ మేరకు అవార్స్ జ్యూరీ సభ్యులను ఆకర్షించడానికి టీమ్ రెడీ అయ్యింది. మరి మన తెలుగు సినిమా అకాడమీ అవార్డ్స్ రేసులో ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
కాగా, 1920స్ బ్యాక్ డ్రాప్ లో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా అల్లుకున్న కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.