Begin typing your search above and press return to search.
RRR స్టార్ల ఇమేజ్ పై రన్ అయ్యే సినిమా కాదు!
By: Tupaki Desk | 5 Nov 2019 9:15 AM GMTదర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'RRR' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. 'బాహుబలి-2' తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్.. ఎన్టీఆర్ లాంటి బడా స్టార్లు మొదటిసారిగా కలిసి నటిస్తుండడం కూడా ఈ సినిమాపై క్రేజును మరింతగా పెంచుతోంది.
ఈ సినిమాకు ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో 'RRR' గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. 'RRR స్ట్రాంగ్ కంటెంట్ ఉండే సినిమా. స్టార్ల ఇమేజ్ పై రన్ అయ్యే సినిమా కాదు. పంచ్ డైలాగ్స్ రాయాల్సిన అవసరం లేదు.. మాస్ ప్రేక్షకులకోసం ప్రత్యేకంగా సీన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా కథ అంత బలమైనది' అంటూ కథ RRR గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
బుర్రా గారు చెప్పిన మాటలను బట్టి ఈ సినిమాలో చరణ్.. ఎన్టీఆర్లు మాస్ హీరోల తరహాలో కాకుండా కథలో భాగంగా బలమైన పాత్రల తీరులో ఉంటాయన్నమాట. మరి ఇద్దరి పాత్రలు ఎలా ఉంటాయో తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ వేచి చూడకతప్పదు. 'మహానటి' లాంటి అద్భుతమైన సినిమాలకు ప్రేక్షకులనే మెప్పించే సంభాషణలు అందించిన సాయి మాధవ్ బుర్రాకు రాజమౌళితో పనిచేయడం ఇదే మొదటిసారి. దీంతో ఆయన ఈ సినిమాకు మరపురాని సంభాషణలు అందించడం ఖాయమని మనం ఫిక్స్ అయిపోవచ్చు.