Begin typing your search above and press return to search.

RRR లేపితే.. కిందకు లాగిన ఆచార్య

By:  Tupaki Desk   |   28 May 2022 11:30 PM GMT
RRR లేపితే.. కిందకు లాగిన ఆచార్య
X
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంత కాలంగా పాన్ ఇండియా సినిమాలు ఏ స్థాయిలో రూపొందుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన హీరోలు బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా భారీ బడ్జెట్ సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్నారు.

బాక్సాఫీస్ మార్కెట్ పరంగా చూసుకుంటే టాలీవుడ్ ప్రస్తుతం నెంబర్ వన్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇటీవల కాలంలో RRR సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ దేశం మొత్తంలో మరోసారి నెంబర్ వన్ స్థాయిలో నిలబడింది.

RRR సినిమా అలా పైకి తీసుకురాగానే ఆచార్య సినిమా మాత్రం ఒక్కసారిగా కిందకు లాగేసింది. ఈ డిజాస్టర్ మూవీ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికే RRR సినిమాతో సక్సెస్ కొట్టిన రామ్ చరణ్ ను ఆచార్య సినిమా ఒక్కసారిగా కిందకు లాగేసి నట్టుగా అనిపించింది. త్రిబుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల భారీ బడ్జెట్ అందుకోవడమే కాకుండా ఇటీవల ఓటీటీలో కూడా 1000 మిలియన్ మినిట్ వ్యూవ్స్ అందుకోవడం సంచలనం అనే చెప్పాలి.

జీ5 లో ఇటీవల RRR సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఇక RRR లో వచ్చినప్పుడే అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య కూడా విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓటీటీ లో కూడా ఆచార్య సినిమా డిజాస్టర్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు అక్కడ కూడా పెద్దగా ఆదరణ ఏమీ తగ్గలేదట.

అసలే బాక్సాఫీస్ వద్ద దాదాపు 70 కోట్లకుపైగా నష్టాలను మిగిల్చిన ఆచార్య సినిమా భారతదేశం మొత్తం లోనే ఈసారి బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా నిలిచింది. ఆచార్య డిజాస్టర్ అవ్వడం మెగాస్టార్ కు మాత్రమే కాకుండా రామ్ చరణ్ పాన్ ఇండియా మార్కెట్ పై కూడా ఎంతో కొంత ప్రభావం చూపుతుంది అని అనిపిస్తోంది.

మరి తదుపరి సినిమాలతో రామ్ చరణ్ ఎంత వరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.