Begin typing your search above and press return to search.
జపాన్ లో RRR సరికొత్త సంచలనం.. ఆ రికార్డ్ బ్రేక్..!
By: Tupaki Desk | 13 Dec 2022 10:30 AM GMTరాజమౌళి సృష్టించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇండియాతో పాటుగా వరల్డ్ వైడ్ గా ఈ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అయిన ఆర్.ఆర్.ఆర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక జపాన్ లో రీసెంట్ గా అక్కడ భాషలో రిలీజ్ చేయగా అక్కడ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. జపాన్ లో 8 వారాల్లో 403 మిలియన్ యాన్ లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది ఆర్.ఆర్.ఆర్. జపాన్ లో పాతికేళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ నెలకొల్పిన ముత్తు సినిమా రికార్డ్ ని కూడా బ్రేక్ చేసింది.
జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ హంగామా కొనసాగుతూనే ఉంది. రాజమౌళి, ఎన్.టి.ఆర్, చరణ్ ముగ్గురు కలిసి జపాన్ రిలీజ్ సందర్భంగా అక్కడ క్రేజీ ప్రమోషన్స్ చేశారు. సినిమాలో విషయం ఉండటంతో పాటుగా ఈ ప్రమోషన్స్ కూడా తోడై సినిమాని జపాన్ లో సక్సెస్ చేశాయి. జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ మొదటి వారం నుంచి వసూళ్లలో దూకుడు చూపించింది. సినిమా ఫస్ట్ వీక్ 81.3 మిలియన్ యాన్లు కలెక్ట్ చేయగా 8వ వారం వరకు మంచి కలక్షన్స్ రాబట్టింది. 8 వారాలు పూర్తయ్యే సరికి 403 మిలియన్ యాన్ లతో ముత్తు రికార్డ్ బ్రేక్ చేసింది.
ముత్తు సినిమా అప్పట్లోనే 400 మిలియన్ యాన్ లను సంపాదించింది. బాహుబలి కూడా జపాన్ లో క్రేజీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే బాహుబలి ముత్తు వసూళ్లను దాటలేదు కానీ ఆర్.ఆర్.ఆర్ మాత్రం ముత్తుని కూడా దాటేసి ఆ సినిమాపై కొత్త రికార్డ్ నెలకొల్పింది. జపాన్ లో సినిమాలు ఇప్పటికె 100 రోజులు, 150, 200 రోజులు అలా సినిమాలు ఆడేస్తున్నాయి. అక్కడ ఇంకా డిజిటల్ విప్లవం అంతగా రాలేదు. అందుకే థియేటర్స్ లోనే ఎక్కువ రోజులు సినిమాలు ఆడుతున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ సృష్టించిన ఈ రికార్డ్ తో మరోసారి ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబల్ అవార్డుల్లో ఆర్.ఆర్.ఆర్ నామినేట్ అవగా ఆస్కార్ కి కూడా ఆర్.ఆర్.ఆర్ కి అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఆర్.ఆర్.ఆర్ తో ప్రపంచం మొత్తం మరోసారి ఇండియన్ సినిమా అదికూడా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు మన జక్కన్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.