Begin typing your search above and press return to search.

క్రైసిస్ ఎఫెక్ట్ ఎక్కువగా పడింది ఆ సినిమాపైనే...!

By:  Tupaki Desk   |   23 July 2020 8:10 AM GMT
క్రైసిస్ ఎఫెక్ట్ ఎక్కువగా పడింది ఆ సినిమాపైనే...!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఆర్.ఆర్.ఆర్'. స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ లు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ చిత్రంలో చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు'గా కనిపిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ అలియా భట్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ జరుపుకున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కరోనా పరిస్థితుల వల్ల ఆగిపోయింది.

కాగా ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులిచ్చిన నేపథ్యంలో కొన్ని చిన్న సినిమాలు చిత్రీకరణ స్టార్ట్ చేస్తున్నాయి. అయితే ఆర్.ఆర్.ఆర్ హీరోలు తారక్ - చరణ్ లు కరోనా వాక్సిన్ వచ్చే వరకు సినిమా షూటింగ్ లో పాల్గొనలేమని చెప్పేశారట. మరోవైపున ఈ సినిమా బిజినెస్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఈ చిత్రంపై క్రియేట్ అయిన హైప్ వల్ల చాలా మంది కరోనా డేస్ కి ముందే ఈ సినిమాను చాలా ఏరియాలలో ఫ్యాన్సీ రేట్స్ కి అమ్మేసారట. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏర్పడిన క్రైసిస్ వల్ల బయ్యర్లు ఇచ్చిన అడ్వాన్స్ లో సింహ భాగం వెనక్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారట. ఇప్పుడు ఇవన్నీ రాజమౌళి క్రియేటివిటీ మీద ప్రభావం చూపుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య రాజమౌళి అసలు డైరెక్షన్ టీమ్ కి కూడా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. కారణాలు ఏవైనా మొత్తం ఇండస్ట్రీలో కరోనా వల్ల బాగా ఎఫెక్ట్ అయిన సినిమా 'ఆర్.ఆర్.ఆర్' అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.