Begin typing your search above and press return to search.
ఆర్‌ఆర్‌ఆర్ : ఆస్కార్ కోసం ఆ ఏజెన్సీ తో జక్కన్న ఒప్పందం
By: Tupaki Desk | 6 Jan 2023 6:35 AM GMTఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని స్టామినాను చాటిన రాజమౌళి అంతటితో ఆగకుండా సినిమాను ఆస్కార్ బరిలో నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశం నుండి అధికారికంగా ఆస్కార్ కోసం ఎంట్రీ దక్కక పోవడంతో సొంతంగా ఆస్కార్ బరిలో సినిమాను నామినేట్ చేయించేందుకు జక్కన్న టీమ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
గత రెండు మూడు నెలలుగా రాజమౌళితో పాటు యూనిట్ సభ్యులు దేశ విదేశాలు తిరుగుతూ ఆస్కార్ సినిమా కోసం ఆర్ ఆర్ ఆర్ ను ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి జక్కన్న టీమ్ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక ఇండియన్ ఫిల్మ్ మేకర్ గా జక్కన్న నిలిచారు.
హాలీవుడ్ సినిమాల యొక్క పబ్లిసిటీ మరియు ఇతర విషయాలను చూసుకుంటూ ఉండే ఈ ఏజెన్సీ ఇప్పుడు ఆస్కార్ బరిలో మన ఆర్ ఆర్ ఆర్ ను నిలిపేందుకు సాధ్యం అయినంత గ్రౌండ్ వర్క్ చేస్తుందట. అందులో భాగంగా ఇప్పటికే ఆస్కార్ ఓటింగ్ సభ్యులందరికి కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాను ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయడం జరిగిందట.
అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో మరియు ప్రముఖ జర్నలిస్ట్ లు ఆర్ ఆర్ ఆర్ సినిమాను గురించి చర్చ జరిగే విధంగా కూడా ఈ ఏజెన్సీ పని చేస్తుందని అంటున్నారు. సినిమాలో కంటెంట్ ఉన్నా కూడా ఇలాంటి ఏజెన్సీ ల ద్వారా వెళ్లకుంటే ఆస్కార్ వాకిట్లో అడుగు పెట్టడం అసాధ్యం. అందుకే జక్కన్న టీమ్ ఈ ఏజెన్సీని ఆశ్రయించినట్లుగా సమాచారం అందుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.