Begin typing your search above and press return to search.
#RRR జనని.. ఉద్రేకం పెంచుతున్న జననీ
By: Tupaki Desk | 26 Nov 2021 9:58 AM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన #RRR సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమ్ ప్రచారంలో వేగం పెంచింది. వరుసగా టీజర్ పాటలు అంటూ అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది జక్కన్న టీమ్. ఇటీవల రిలీజ్ చేసిన `నాటు నాటు హుక్ స్టెప్` ఇంటర్నెట్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. కోట్లాది వ్యూస్ తో ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
తాజాగా జననీ..అంటూ సాగే దేశభక్తి గీతాన్ని విడుదల చేసారు. జననీ ప్రియభారత జననీ ..! పాట ఆద్యంతం ఉద్విగ్నం కలిగించే దృశ్యాలు మతి చెడగొట్టాయి. అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్ర.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పాత్ర స్వరూపాల్ని కూడా ఇందులో ఆవిష్కరించారు. సరోజిని నేనంటే నా పోరాటం.. అందులో నువ్వు సగం! అంటూ అజయ్ దేవగన్ ని విప్లవ యోధుడిగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. అతడి పాత్ర ఇందులో మరో హైలైట్ అని అర్థమవుతోంది. దేవగన్ సరసన శ్రీయ నాయికగా కనిపిస్తోంది.
ఎన్టీఆర్ లో డ్యూయల్ షేడ్ .. గిరిజనుడిగా ముస్లిమ్ యువకుడిగా కనిపిస్తున్నారు. చరణ్ ఒక పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నారు. అయితే పోరాటం కోసం తారక్ - చరణ్ కలుస్తారు. ఇక ఈ విజువల్ లో ఆలియా సీత పాత్రలో ఎంత ముచ్చటగా ఉంటుందో చూపించడం విశేషం. రెండు జెళ్ల సీతలా ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది ఆలియా. తెల్లోళ్ల తుపాకులు భారతీయుల గుండెల్లో పేలుతుంటే .. చిన్నారులు ప్రజలు ఆడాళ్లు నేలకూలుతుంటే ఆ దృశ్యాల్ని ఎంతో భావోద్వేగానికి గురి చేసేవిగా చూపించనున్నారని అర్థమవుతోంది. నిమిషాల నిడివిలోనే ఈ వీడియో ఉత్కంఠ పెంచింది. ముఖ్యంగా ఎం.ఎం.కీరవాణి మాస్టర్ క్లాస్ ట్యూన్ ఎంతో ఉద్వేగాన్ని పెంచుతోందనడంలో సందేహం లేదు. సోల్ ఆంథమ్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్ పేరుతో జననీ పాటను విడుదల చేశారు. ఇది యూట్యూబ్ లో దూసుకెళుతోంది.