Begin typing your search above and press return to search.
#RRR డే-1లోనే అమెరికాలో 50కోట్ల క్లబ్
By: Tupaki Desk | 26 March 2022 3:21 PM GMTఅన్ని వాయిదాల అనంతరం ఒక మంచి డేట్ తో #RRR రిలీజైంది. అంతా ఊహించినట్టుగానే ఎన్నో అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మిక్స్ డ్ టాక్ క్రిటిక్స్ విమర్శలు ఎలా ఉన్నా ఈ సినిమా వసూళ్ల పరంగా ఎదురు లేకుండా దూసుకెళుతోంది.
ఇంటా బయటా ఈ చిత్రం సునామీ వసూళ్లను సాధిస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తుంటే ఇన్నాళ్ల కష్టాన్ని రాజమౌళి అండ్ టీమ్ మర్చిపోయినట్టయ్యింది. ఈ మూవీకి ఆరంభం నుంచి ఎన్నో ఆటంకాలు... కష్టాలు అన్నిటికీ ఇప్పుడు రిజల్ట్ సమాధానంగా నిలవనుంది.
తాజా సమాచారం మేరకు అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ 50 కోట్ల క్లబ్ (6.5 మిలియన్ డాలర్లు)లో అడుగుపెట్టేసింది. కేవలం ప్రీమియర్లు కలుపుకుని ఒక రోజులోనే ఈ రేర్ ఫీట్ సాధించడం చర్చనీయాంశమైంది.
అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ గర్జిస్తోందని డే 1లో 11.45 ఏఎం వద్ద వసూళ్ల కౌంట్ అద్భుతంగా కొనసాగుతోందని ఇంతకుముందు చిత్రబృందం ప్రకటించింది. 4.5 మిలియన్ డాలర్లు అప్పటికి వసూలైంది.. అంటే సుమారు 34.5 కోట్లు వసూలు చేసింది.
రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి తెరపై మొదటిసారిగా కనిపించడం .. అది అభిమానుల్లో పోటీకి తెర తీసిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం కూడా వసూళ్లపై స్పష్ఠంగా కనిపిస్తోంది. డే1 బాక్సాఫీస్ వద్ద అద్భుత సందడితో ప్రారంభమైంది. USలో ఈ చిత్రం ప్రీమియర్ షోల నుండి $3 మిలియన్లు వసూలు చేసిందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇంతకుముందే వెల్లడించారు.కేవలం ప్రీమియర్ షోల నుండి $3 మిలియన్ల క్లబ్ ను అధిగమించిన మొదటి భారతీయ చిత్రం ఇదేనని ప్రకటించారు. ఇంతలోనే ఈ చిత్రం డే వన్ లో 11.45 నిమిషాలకు ఏకంగా 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని వెల్లడించడం ఒక సంచలనం. సాయంత్రానికి ఈ ప్రభంజనం 6.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది.
రాఫ్తార్ క్రియేషన్స్ ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాని విడుదల చేసింది. వారి ట్విట్టర్ పేజీ సమాచారం మేరకు.. "USA ప్రీమియర్స్ కామ్ స్కోర్.. అవర్లీ గ్రాస్ పరిశీలిస్తే.. 981 లొకేషన్ ల నుండి $3000127 రాత్రి 7:45 PM PST నుండి ప్రీమియర్స్ (sic) ద్వారా వసూలైంది. $3 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న అసాధాణ భారతీయ చిత్రమిది" అని వెల్లడించింది. తాజాగా ఒక రోజులోనే 50కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందని సంస్థ రివీల్ చేయడం ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ చేస్తోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే అమెరికాలో 150కోట్లు వసూలు చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇక బాహుబలి 1.. బాహుబలి 2 చిత్రాలు ఇంతకుముందు అమెరికాలో సంచలన వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.
దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించిన ఆర్.ఆర్.ఆర్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రికార్డు సంఖ్యలో స్క్రీన్ లలో గ్రాండ్ గా విడుదలైంది. RRR అనేది 1920కి పూర్వం జరిగిన కథాంశం. పూర్వ స్వాతంత్య్ర యుగంలో జరిగిన కల్పిత కథ .. ఇది ఇద్దరు నిజమైన హీరోలు .. సుప్రసిద్ధ విప్లవకారుల జీవితాల ఆధారంగా రూపొందించారు. అల్లూరి సీతారామ రాజు - కొమరం భీమ్ కలయికతో వచ్చిన చిత్రమిది. రామ్ చరణ్ సీతారామరాజుగా నటించగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భీమ్ గా నటించారు.
RRR రాజమౌళి నుంచి మొదటి పూర్తి నిడివి పీరియాడికల్ చిత్రం. అతని చిత్రం మగధీరలో ఒక పీరియడ్ పోర్షన్ ఉన్నా.. దాదాపు సగం చిత్రం మోడ్రన్ డేస్ తో ఉంటుంది. జక్కన్న తెరకెక్కించిన చాలా చిత్రాల మాదిరిగానే RRR కూడా రివెంజ్ డ్రామానే. కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ వంగాతో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజమౌళి తన సినిమాలు ఎక్కువగా ప్రతీకారంపై ఆధారపడి ఉంటాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఇది బలమైన భావోద్వేగం.. ఈ ఫార్ములాని ఆయన విడిచిపెట్టరు. అదే ఆయన సక్సెస్ మంత్ర.
అజయ్ దేవగన్- అలియా భట్- సముద్రఖని- శ్రియా శరణ్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. నిజానికి RRR సినిమా థియేటర్లలో జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా దేశంలో ఓమిక్రాన్ సంబంధిత కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో విడుదల వాయిదా పడింది.