Begin typing your search above and press return to search.

RRR లేటెస్ట్ ప్రెస్ మీట్ హైలైట్స్..!

By:  Tupaki Desk   |   15 March 2022 11:30 AM GMT
RRR లేటెస్ట్ ప్రెస్ మీట్ హైలైట్స్..!
X
'ఆర్.ఆర్.ఆర్' మూవీ కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ ఇది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది.

ఈ నేపథ్యంలో జక్కన్న అండ్ టీమ్ జోరుగా సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాజమౌళి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ - డీవీవీ దానయ్య హాజరై మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

'బాహుబలి' 1 & 2 సినిమాల కంటే RRR పెద్దదని రాజమౌళి పేర్కొన్నారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కొమరం భీమ్ - అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర అంటూ వస్తున్న వార్తలను రాజమౌళి కొట్టిపారేశారు. ఇది ఎవరి జీవిత చరిత్ర కాదని.. ఇదొక ఫిక్షన్ మూవీ అని జక్కన్న తెలిపారు.

మార్చి 25న ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ అవుతుందని.. ప్రీమియర్‌లను డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయిస్తారని.. తాము ప్రీమియర్‌లకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తారక్ ఒక సూపర్ కంప్యూటర్ అని.. RRR షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తనను చాలాసార్లు ఆశ్చర్యపరిచాడని జక్కన్న పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ గొప్ప మనిషి అని.. అతను స్నేహితుడిగా లభించడం ట్తన అదృష్టమని అన్నారు. 'నాటు నాటు' పాట బిగ్ స్క్రీన్‌ పై చూడటానికి అద్భుతంగా ఉంటుందని.. ఇది ఇద్దరి అభిమానులకు పండగలా ఉంటుందని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ పాండమిక్ తో సమయం వృథా కావడం తప్ప మిగిలిన అన్ని విషయాలు చాలా సంతోషంగా ఉన్నాయని తారక్ తెలిపారు.

రాబోయే రోజుల్లో తెలుగు సినిమా నుండి మరిన్ని భారీ మల్టీ స్టారర్ చిత్రాలను ప్రేక్షకులు చూస్తారని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన బాబాయ్ బాలయ్య - చిరంజీవి - మహేష్ బాబు - ప్రభాస్ - అల్లు అర్జున్‌ లతో మల్టీ స్టారర్ సినిమాలు చేయాలనుకుంటున్నానని జూ.ఎన్టీఆర్ వెల్లడించారు.

RRR సెట్స్‌ లో ఎన్టీఆర్ నటనా నైపుణ్యం చూసి తాను ఆశ్చర్యపోయానని రామ్ చరణ్ అన్నారు. ‘‘ఉక్రెయిన్‌ లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం లేదు. అక్కడ నాకు సెక్యూటిరీగా ఉన్న వ్యక్తితో ఫోన్‌ ద్వారా టచ్‌ లో ఉన్నా. 80 ఏళ్ళ వయసున్న అతని తండ్రి గన్‌ పట్టుకుని యుద్థంలో పాల్గొంటున్నారు. ఆ విషయం తెలిసి మనసు ద్రవించి నా వంతుగా కొంత డబ్బు పంపించాను’’ అని చరణ్‌ చెప్పారు.

ఈ విషయంపై తారక్‌ కూడా స్పందిస్తూ.. ఉక్రెయిన్‌ ప్రజలకు - ముఖ్యంగా డ్యాన్సర్లకు కొత్త విషయం తెలుసుకోవాలనే తపన ఎక్కువ. వారంతా చాలా ఫ్రెండ్లీ పర్సన్స్‌. అక్కడి డాన్సర్ల గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ‘నాటు నాటు’ సాంగ్‌ లో వాళ్ళు ఎంత బాగా చేశారో. వాళ్ళకు కొత్త విషయం తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువ’ అని అన్నారు.

ఉక్రెయిన్‌ లో షూటింగ్ అద్భుతంగా చేశాం.. కానీ అక్కడ యుద్ధం వస్తుందని ఊహించలేదు. ఉక్రెయిన్‌ ప్రజలు చాలా సహకరించారు. అక్కడి ఫుడ్ - కల్చర్ బాగా నచ్చాయి. ఇలాంటి ఒక వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని RRR టీం చెప్పుకొచ్చారు.

ఉక్రెయిన్‌ లో షూటింగ్ అద్భుతంగా చేశాం.. కానీ అక్కడ యుద్ధం వస్తుందని ఊహించలేదు. ఉక్రెయిన్‌ ప్రజలు చాలా సహకరించారు. అక్కడి ఫుడ్ - కల్చర్ బాగా నచ్చాయి. ఇలాంటి ఒక వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని RRR టీం చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ను కలిశాక తమకెంతో సంతృప్తి కలిగిందని.. అన్ని విషయాలపై ఆయన సానుకూలంగా స్పందించారని రాజమౌళి అన్నారు.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. దీనికి కీరవాణి సంగీతం సమకూర్చగా.. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇందులో అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరీస్ కీలక పాత్రలు పోషించారు.