Begin typing your search above and press return to search.
సెంటిమెంటు సెట్టవడం లేదు జక్కన్నా..!
By: Tupaki Desk | 3 Nov 2018 4:43 AM GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం #RRR నవంబర్ 11 వ తేదీన ఉదయం 11 గంటల 11 నిముషాలకు లాంచ్ చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అన్నీ నంబర్లు 11. భలే భలే ఫ్యాన్సీగా ఉంది. కానీ కొంతమంది అభిమానులు మాత్రం ఈ ఫ్యాన్సీ నంబర్ కు ఫ్లాపు సెంటిమెంట్ ఉందని గత చరిత్ర తవ్వితీస్తున్నారు.
సిద్ధార్థ్ హీరోగా నటించిన 'ఓ మై ఫ్రెండ్' 2011 లో నవంబర్ 11(11/11/11) నాడు రిలీజ్ అయింది. అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ సినిమా 'అఖిల్' రిలీజ్ అయింది 2015 లో. నవంబర్ 11 వ తేదీన...అంటే 11/11. ఇక నాగ చైతన్య హీరోగా నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' రిలీజ్ అయింది 11/11 నే.. కాకపోతే 2016 లో. ఈ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఆ సినిమాలు జస్ట్ డిజాస్టర్లు కాదు. ఆ దెబ్బకు కోలుకోవడం తర్వాత అంత సులువుగా లేదు.
సిద్దార్ట్ తన 'ఓ మై ఫ్రెండ్' దెబ్బకు దాదాపుగా టాలీవుడ్ నుండి కనుమరుగయ్యాడు. ఆ తర్వాత 2013 లో 'జబర్దస్త్' అనే సినిమా రిలీజ్ అయింది కానీ అదెప్పుడు వచ్చిందో వెళ్ళిందో ఎవ్వరికీ తెలీదు. ఇక అఖిల్ తన డెబ్యూ సినిమా ఇంపాక్ట్ నుండి బయటకు వచ్చే సరికి దాదాపు మూడేళ్ళు పట్టింది. ఇప్పటికీ తనకు హిట్ రాలేదు. ఇక చైతు విషయం మాత్రం గుడ్డిలో మెల్లే. 'సాహసం శ్వాసగా సాగిపో' ఫ్లాపు నుండి 'రారండోయ్ వేడుక చూద్దాం' కాస్త కోలుకున్నాడు. అయినా 'రారండోయ్ వేడుక చూద్దాం' తో బ్లాక్ బస్టర్ ఖాయమని నాగార్జున చెప్పడం.. అభిమానులు చైతు 50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అనుకున్నారు గానీ అవన్నీ జరగలేదు. ఇవన్నీ గుర్తు చేస్తున్న అభిమానులు అంత కాంప్లికేటేడ్ డేట్ మనకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
మరి రాజమౌళి ఇవన్నీ పట్టించుకుంటాడో లేదో. అందరూ జూనియర్ ఎన్టీఆర్ అనో .. లేదా తారక్ అని పిలిచే యంగ్ టైగర్ పేరును కూడా మూడు 'R' లెటర్లు వస్తాయని 'రామారావు' అని పోస్టర్ లో పెట్టిన ఘనుడు జక్కన్న. అప్పట్లో నందమూరి ట్యాగ్ ను ఎన్టీఆర్ వదిలేస్తున్నాడని కాస్త హీటెడ్ డిబేట్లు కూడా జరిగాయి. అప్పుడే చలించలేదు. మరి ఇప్పుడు ఈ నెంబర్ సెంటిమెంట్ పట్టించుకుంటాడా?