Begin typing your search above and press return to search.

ఆర్ఆర్‌ఆర్‌ : ప్లీజ్‌ అలా చేయకండి

By:  Tupaki Desk   |   27 March 2022 2:30 PM GMT
ఆర్ఆర్‌ఆర్‌ : ప్లీజ్‌ అలా చేయకండి
X
దేశ వ్యాప్తంగా సంచలన వసూళ్లను నమోదు చేస్తున్న ఆర్‌ ఆర్ ఆర్ కు యూట్యూబ్‌ లో చిన్న వీడియో లు పెద్ద తలనొప్పిగా మారాయి. సినిమాకు సంబంధించిన సన్నివేశాలను యూట్యూబ్‌ లో షేర్‌ చేయడంతో చాలా మంది సినిమా ను చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కేవలం ఆర్ ఆర్ ఆర్‌ కు మాత్రమే కాకుండా ఈమద్య కాలంలో విడుదల అవుతున్న పెద్ద సినిమాలు అన్ని కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు సంబంధించిన దాదాపు అన్ని ముఖ్య సన్నివేశాలు మరియు పాటలు అన్ని కూడా సోషల్‌ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌ లో షేర్‌ చేస్తున్నారు. దాంతో సినిమా పై ఆసక్తి జనాల్లో తగ్గుతుంది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయమై సోషల్‌ మీడియా ద్వారా అప్పీల్‌ చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సినిమాను ఇలా షేర్‌ చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు.

డివివి నిర్మాణ సంస్థ నుండి ట్వీట్‌ వచ్చింది. ఆ ట్వీట్‌ లో దయచేసి సినిమాకు సంబంధించిన సన్నివేశాలను ఇలా షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో యూట్యూట్‌ లో షేర్‌ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలా చేయడం ద్వారా సినిమా పై జనాల్లో ఆసక్తి తగ్గుతుందని వారు తెలియజేశారు. సినిమాకు చాలా డ్యామేజీ చేసే ఆ పని చేయవద్దంటూ ప్రతి ఒక్కరిని మేకర్స్ రిక్వెస్ట్‌ చేశారు.

ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది.. ఇప్పుడు చిత్ర యూనిట్‌ సభ్యులు అప్పీల్‌ చేయడం ద్వారా ఉపయోగం ఏమీ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి అయినా యూట్యూబ్‌ లో ఉన్న ఆ సినిమాకు సంబంధించిన వీడియో లను తొలగించాల్సిందిగా యూనిట్‌ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా వసూళ్ల విషయంలో ఇండియాస్ బిగ్గెస్ట్‌ మూవీస్ జాబితాలో చేరబోతుంది.

ఈ సమయంలో ఇలాంటి వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం వల్ల సినిమాకు చాలా నష్టం జరుగుతుంది అంటున్నారు. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాలుగా హీరోల ఇంట్రడక్షన్‌ సన్నివేశాలు అంటున్నారు. అలాంటి సన్నివేశాలను యూట్యూబ్‌ లో షేర్‌ చేస్తే ప్రేక్షులకు చూడాలనే ఆసక్తి ఉత్సాహం ఎలా కలుగుతుంది. అందుకే సినిమా ను కిల్‌ చేసే అలాంటి వీడియోలను షేర్ చేయడం ఆపేయాలి.