Begin typing your search above and press return to search.
#RRR బాలీవుడ్ రైట్స్ ఎవరికి?
By: Tupaki Desk | 18 March 2019 2:10 PM GMTరాజమౌళి 'బాహుబలి' సినిమాతో తన స్థాయి - సత్తా ఏంటో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు కూడా చూపించాడు. బాహుబలి చిత్రం ఉత్తరాదిన బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల స్థాయిలో రాబట్టింది. బాహుబలిని బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేసి భారీగా లాభాలను దక్కించుకున్న మాట అందరికి తెల్సిందే. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఇప్పటికే ఈ చిత్రాన్ని దాదాపు 10 భాషల్లో విడుదల చేస్తామంటూ దానయ్య ప్రకటించిన విషయం తెల్సిందే. రాజమౌళి సినిమా ఖచ్చితంగా ఒక్క తెలుగు ఆడియన్స్ కు మాత్రమే కాకుండా అన్ని భాషల వారికి నచ్చుతుందనే ఉద్దేశ్యంతో అన్ని భాషల నుండి రైట్స్ ను దక్కించుకునేందుకు చాలా మందే వస్తున్నారు.
పలు భాషల్లో ఈ చిత్రం విడుదల చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు అంటూ ప్రెస్ మీట్ లో స్వయంగా దానయ్య వెళ్లడించిన విషయం తెల్సిందే. ఇతర భాషల విషయం పక్కన పెడితే హిందీలో ఈ చిత్రంను విడుదల చేసే వారు ఎవరా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ సంస్థలైన ధర్మ ప్రొడక్షన్స్ మరియు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ఇంకా పలు చిన్నా పెద్ద సంస్థలు ఆర్ ఆర్ ఆర్ డబ్బింగ్ రైట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయట.
నిర్మాత సైతం షాక్ అయ్యే ప్రైస్ ను వారు ఆఫర్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతానికి ఏ భాష రైట్స్ ను అమ్మే యోచనలో దానయ్య లేడని - సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయిన తర్వాత అమ్మాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. డబ్బింగ్ రైట్స్ అమ్మే విషయంలో రాజమౌళి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగబోతుంది. ఆ ఆరు నెలల్లో ఈ బిజినెస్ వ్యవహారాలు చక్కబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 350 నుండి 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లుగా దానయ్య ప్రకటించిన విషయం తెల్సిందే. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ 500 నుండి 600 కోట్లు ఉండేలా ప్లాన్ చేయవచ్చు అంటూ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.