Begin typing your search above and press return to search.
జపాన్ లో రెండున్నరేళ్ల చరిత్రని తిరగరాసిన 'RRR'
By: Tupaki Desk | 11 Dec 2022 2:30 PM GMTపాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' జపాన్ బాక్సాఫీస్ ని సైతం షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తారక్...చరణ్ దూకుడు చూసి తెలుగు సినిమా జపాన్ లో జెండా పాతేయడం ఖాయమని అంతా భావించారు. బాహుబలి ఏంటి? దాని అమ్మమ్మ రికార్డులు కూడా తిరగరాసేస్తుందని ట్రేడ్ అంచనా వేసింది. సిసలైన గ్లోబల్ మూవీగా 'ఆర్ ఆర్ ఆర్' సరికొత్తరికార్డు సృష్టిస్తుందని నిపుణులు సైంతం అంచనా వేసారు.
తాజాగా వాటన్నింటిని 'ఆర్ ఆర్ ఆర్' చేధించింది. ఇప్పటికే బాహుబలి వసూళ్లను ట్రిపుల్ ఆర్ బ్రేక్ చేసింది. బాహుబలి 3000 మిలియన్ యోన్ లు సాధించగా ఆర్ ఆర్ ఆర్ 400 మిలియన్ యోన్ లు సాధించి తెలుగు సినిమా పేరిట ఉన్న పాత రికార్డును చెరిపేసి కొత్త రికార్డు నమోదు చేసింది. కేవలం 20 రోజుల్లోనే ఆర్ ఆర్ ఆర్ 206 మిలియన్ యోన్లను సాధించడంతో బాహుబలి రికార్డు చెరిగిపోతుందని గెస్సింగ్ తెరపైకి వచ్చాయి.
చివరికి అనుకున్నట్లు గానే జరిగింది. తాజాగా రెండున్నరేళ్ల దశాబ్ధం క్రితం నాటి బాక్సాఫీస్ రికార్డును సైతం తవ్వి తీసి బద్దలు కొట్టిందీ చిత్రం. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'ముత్తు' జపాన్ లో అప్పట్లో 23.50 కోట్ల వసూళ్లను సాధించింది. ఇప్పటివరకూ ఈ వసూళ్లు భారతీయ సినిమా చరిత్రలో జపాన్లో ఓ రికార్డుగా ఉంది.
తాజాగా ఆ సినిమా వసూళ్లని సైతం 'ఆర్ ఆర్ ఆర్' పక్కకు నెట్టేసింది. జపాన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా 23 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఇండియన్ మార్కెట్ లో ఎక్కినట్లే జపాన్ మార్కెట్లోనూ ఆర్ ఆర్ ఆర్ నెమ్మదిగా ఎక్కినట్లు కనిపిస్తుంది. 'ముత్తు' రికార్డు బ్రేక్ చేయడం అన్నది ఇప్పట్లో సాధ్యం కాని పని భావించిన ట్రేడ్ అంచనాల్ని సైతం బ్రేక్ చేసింది. దీంతో భారతీయ సినిమా సహా జపాన్ చరిత్రలోనూ సరికొత్త చరిత్ర లిఖించిందని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.