Begin typing your search above and press return to search.
2.O -బాహుబలి 2- RRR కంటే పెద్ద బడ్జెట్ తో?
By: Tupaki Desk | 4 Jun 2021 5:30 AM GMTరజనీ-శంకర్ ల 2.O కోసం లైకా సంస్థ దాదాపు 550కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేసిందని అప్పట్లో ప్రచారమైంది. పాన్ ఇండియా కేటగిరీలోనే అసాధారణ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిటర్నులు తేవడంలో తడబడింది. అయితే పాన్ ఇండియా బేస్డ్ టాలీవుడ్ సినిమాలు బాహుబలి-బాహుబలి 2 కోసం ఆర్కా మీడియా సంస్థ దాదాపు 500కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అది రెండు సినిమాలకు పెట్టిన మొత్తం బడ్జెట్ వ్యాల్యూ. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు దాదాపు 2200కోట్లు వసూలు చేశాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో చరిత్ర. అమీర్ ఖాన్ నటించిన దంగల్ కేవలం 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 1600 కోట్లు వసూలు చేయడం మరో సెన్సేషన్.
ఇప్పుడు ఈ రికార్డుల్లో ఏదో ఒక రికార్డుని అయినా ఆర్.ఆర్.ఆర్ టచ్ చేస్తుందా? కనీసం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రికార్డును అయినా టచ్ చేయగలదా? అన్నది ఆసక్తిగా మారింది. బాహుబలి 1 దాదాపు 600కోట్ల వసూళ్లు తెచ్చింది. కానీ ఆర్.ఆర్.ఆర్ సుమారు 900కోట్ల మేర బిజినెస్ చేసింది కాబట్టి బాహుబలి 2 రేంజులో 1600-1800కోట్లు తేవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగానే తాడిని తన్నేవాడొకడుంటే వాడి తలదన్నేవాడొకడుంటాడు! అన్న చందంగా రాజమౌలి-మహేష్ చిత్రానికి 2.0 -ఆర్.ఆర్.ఆర్- బాహుబలి 2 లను మించిన బడ్జెట్ పెట్టాలనే ప్రతిపాదన ఉందిట. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఇప్పటికే ఫిక్సయ్యింది. ఆర్.ఆర్.ఆర్ దాదాపు 400కోట్లు పెడుతుంటే.... మహేష్ చిత్రానికి 550 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయనున్నారని ప్రచారమవుతోంది. నిజానికి లైకా సంస్థ 2.0 కోసం పెట్టినంత బడ్జెట్ అన్నమాట. ఇదే నిజమైతే గొప్ప సెన్సేషన్ గానే భావించాలి.
మహేష్ కి ఇది పాథ్ బ్రేకింగ్ మూవీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి కెరీర్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబోగా ఈ ప్రాజెక్టు ఉత్కంఠ పెంచుతుంది. ఇరువురు దిగ్గజాల కలయికలో వ్యాపారం పెద్ద రేంజులోనే పూర్తవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్ ఇంకా స్క్రిప్టును రెడీ చేయాల్సి ఉంది.