Begin typing your search above and press return to search.

వీకెండ్ ను బాగా వాడుకున్న RRR.. హిందీలో పుంజుకున్న వసూళ్ళు..!

By:  Tupaki Desk   |   28 March 2022 12:30 PM GMT
వీకెండ్ ను బాగా వాడుకున్న RRR.. హిందీలో పుంజుకున్న వసూళ్ళు..!
X
యంగ్​ టైగర్ ఎన్టీఆర్ - ​మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా 'ఆర్​.ఆర్​.ఆర్​'. గత శుక్రవారం థియేటర్లలోకి ఈ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. హిందీ సర్క్యూట్ లో ఫస్ట్ డేకి మించి మూడో రోజు వసూళ్ళు అందుకుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

RRR చిత్రాన్ని ఉత్తరాదిలో భారీ స్థాయిలో ప్రమోట్ చేసినప్పటికీ.. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా రాలేదు. దీంతో ఫస్ట్ డే 19 కోట్లు మాత్రమే వచ్చాయి. అయితే శనివారం కాస్త పుంజుకొని రూ.24 కోట్లు రాబట్టింది. ఇక ఆదివారం ఒక్క రోజే రూ. 31.50 కోట్ల మేర వసూలు చేసిన సెన్సేషన్ సృష్టించినట్లు తెలుస్తోంది.

మూడో రోజు ఆదివారం హాలిడే కావడంతో సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆసక్తి చూపారని అర్థం అవుతుంది. ముఖ్యంగా మాస్ సెంటర్‌లలో అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో కరోనా పాండమిక్ తర్వాత నార్త్ మార్కెట్ లో ఒక్క రోజులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది.

ఇంతముందు 'సూర్యవంశీ' (29.94కోట్లు) - '83' (17.41 కోట్లు) - 'గంగుబాయి' (15.30 కోట్లు) సినిమాలు ఒక్కరోజులో ఎక్కువ వసూళ్ళు అందుకున్న సినిమాలు. ఇప్పుడు RRR సినిమా ఆదివారం 30 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో రూ.74.50 కోట్లు సాధించిందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

మౌత్ టాక్ బాగుండటంతో పాటు రివ్యూలు సానుకూలంగా ఉన్నందున రానున్న రోజుల్లో RRR సినిమా కలెక్షన్లు పెరగడం ఖాయమని చెబుతున్నారు. కాకపోతే 'బాహుబలి: ది కన్ క్లూజన్' తో పోలిస్తే ఈ మూవీ కలెక్షన్లు స్లోగా ఉన్నాయని తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.

ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే 500 కోట్ల మార్క్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. లాంగ్ రన్ లో 'బాహుబలి 2' లైఫ్ టైం కలెక్షన్స్ బీట్ చేస్తుందో లేదో చూడాలి.

కాగా, 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌.. కొమురం భీమ్‌ గా జూనియర్‌ ఎన్టీఆర్‌ కనిపించారు. ఆలియా భట్‌ - ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌ తో నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూర్చారు.