Begin typing your search above and press return to search.

RRR 5 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

By:  Tupaki Desk   |   30 March 2022 4:30 PM GMT
RRR 5 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
X

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా.. సాధారణ రోజుల్లోనూ గట్టి ప్రభావాన్ని చూపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి సోమవారం RRR మూవీ దాదాపు 17.50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మంగళవారం AP/TS లలో 13.55 కోట్ల షేర్ వసూలు చేసి మంచి పట్టు సాధించిందని నివేదికలు వెల్లడించాయి.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా మొత్తం 5 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 167.85 కోట్లు షేర్ అందుకుందని నివేదించారు. వీక్ డేస్ లో అన్ని ఏరియాలలో డ్రాప్స్ కనిపించగా.. నైజాం ప్రాంతంలో మాత్రం చాలా తక్కువ శాతం డ్రాప్ తో హోల్డ్ లో ఉంది. నైజాం ఏరియాలో ఈ చిత్రం ఖచ్చితంగా ఫ్రాపిటబుల్ వెంచర్ అనే చెప్పాలి.

కాకపోతే ఆంధ్రాలో బీ సీ సెంటర్లలో RRR ప్రభావం ఆశాజనకంగా లేదని అంటున్నారు. శనివారం ఉగాది సెలవు మరియు ఆదివారం ఉండటంతో దాదాపు అన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించబడుతుంది. మరి ఈ వారాంతంలో పుంజుకొని మంచి వసూళ్ళు రాబడుతుందేమో చూడాలి.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రం నార్త్ ఇండియాలో ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరి సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మంగళవారం ₹ 15.02 కోట్లు రాబట్టి.. మొత్తం ఐదు రోజుల్లోనే ₹ 107.59 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మాస్ సర్క్యూట్స్ నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో.. రాబోయే వీకెండ్ లో సాలిడ్ ఫిగర్స్ ఎక్సపెక్ట్ చేయొచ్చు.

హిందీలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కెరీర్ లో 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన మూడో చిత్రంగా RRR నిలిచింది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు అక్కడ ఫస్ట్ వంద కోట్ల సినిమా ఇది. మరి రానున్న రోజుల్లో ఈ నంబర్ ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

నివేదిక ప్రకారం AP/TS నాలుగు రోజుల RRR కలెక్షన్స్ వివరాలు...

నైజాం – 68.30 కోట్లు
సీడెడ్ – 30.50 కోట్లు
యూఏ – 20.73 కోట్లు
నెల్లూరు – 5.87 కోట్లు
గుంటూరు – 13.07 కోట్లు
కృష్ణా – 9.78 కోట్లు
వెస్ట్ గోదావరి – 9.23 కోట్లు
ఈస్ట్ గోదావరి – 10.36 కోట్లు
AP/TS మొత్తం - 154.31 కోట్లు
నార్త్ ఇండియా - 107.59 కోట్లు

కాగా, RRR చిత్రంలో కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్‌ - అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ ల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇందులో ఆలియా భట్‌ - ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగన్ - శ్రేయా - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు.

డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని నిర్మించారు. విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథకు బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు.