Begin typing your search above and press return to search.

RRR ఏపీ-టీఎస్ లో ఆ జంక్ష‌న్ జామ్ అయ్యిందిగా

By:  Tupaki Desk   |   3 April 2022 5:30 AM GMT
RRR ఏపీ-టీఎస్ లో ఆ జంక్ష‌న్ జామ్ అయ్యిందిగా
X
నాలుగు రోడ్ల కూడ‌లిలో నాలుగు థియేట‌ర్లు ఉంటే ఆ నాలుగు థియేట‌ర్ల‌లోనూ ఒకే సినిమాని ఆడిస్తుంటే క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం ఎలా ఉంటుందో ఆర్టీసీ ఎక్స్ రోడ్ క‌లెక్ష‌న్లు ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక్క‌డ ప్ర‌తి పెద్ద సినిమా ఘ‌నంగా విడుద‌ల‌వుతున్నాయి. రికార్డుల మోత మోగిస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాల‌కు ఈ ఏరియా మాస్ రిపీట్ ఆడియెన్ గా మారి వ‌సూళ్ల మోత‌కు కార‌ణ‌మ‌వుతున్నారు.

ఇక‌పోతే ఆర్.ఆర్.ఆర్ కి కేవ‌లం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేట‌ర్ల నుంచి ఏకంగా రూ.5 కోట్ల వ‌ర‌కూ వ‌సూల‌య్యేందుకు ఆస్కారం ఉంద‌ని రిపోర్ట్ అందుతోంది. కోటి అన్న‌ది ఒకప్ప‌టి మాట.. ఇప్పుడు రూ.2కోట్లు ఒక థియేట‌ర్ లోనే ఫుల్ ర‌న్ లో వ‌సూల‌వుతోంది.

క్రాస్ రోడ్స్ లో సుద‌ర్శ‌న్ 35 ఎంఎంలో రూ.2 కోట్ల గ్రాస్ ను తెస్తోంది ఆర్.ఆర్.ఆర్. క్రాస్ రోడ్స్ లోని అన్ని థియేట‌ర్ల నుంచి ఈ సినిమా రూ.4 కోట్ల గ్రాస్ మార్కుకు చేరుకుంది. పూర్తి ర‌న్ త‌ర్వాత రూ.5కోట్లు క‌ష్ట‌మేమీ కాద‌ని అంచ‌నా వేస్తున్నారు. కేవ‌లం ఒక జంక్ష‌న్ నుంచి చిన్న ప్రాంతం నుంచి ఈ రేంజు క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం అంటే స‌ర్ ప్రైజింగ్ అనే చెప్పాలి. పోటీలో ఎన్ని సినిమాలు వ‌స్తున్నా రెండో వారంలోనూ ఆర్.ఆర్.ఆర్ హ‌వా కొన‌సాగిస్తోంది. ఈ సీజ‌న్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ చ‌రిత్ర సృష్టిస్తోంది.

ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ కలెక్షన్ 9వ రోజు

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR ప్రపంచవ్యాప్తంగా సంచలన వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. 10 రోజుల లోపే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్ల మార్క్ ను దాటింది. ఇప్పుడు రెండో వారంలో కూడా సినిమా అద్భుత వ‌సూళ్ల‌తో అద‌ర‌గొడుతోంది.

రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన RRR విమర్శకులు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అనేక వాయిదాల తర్వాత RRR చివరకు మార్చి 25న విడుదలైంది. ఈ చిత్రం ఓపెనింగ్ బాక్స్ ఆఫీస్ నంబ‌ర్స్ అసాధారణంగా న‌మోద‌య్యాయి. ప‌దిరోజులు రాక ముందే RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్ల మార్కును అందుకుంది.

ట్రేడ్ నిపుణుడు రమేష్ బాలా వివ‌రాల ప్ర‌కారం..``#RRRMovie WW బాక్సాఫీస్ వద్ద 800 కోట్ల గ్రాస్ దాటింది.. `` అని వెల్ల‌డించారు. 8వ రోజుకే 710 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం తొమ్మిదో రోజు మ‌రో 90కోట్లు క‌లుపుకుని ఓవ‌రాల్ గా 800 కోట్లు వ‌సూలు చేసింది. రెండు వారాల్లో ఈ చిత్రం 1000 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది.