Begin typing your search above and press return to search.

#RRR ఎన్టీఆర్ రాబ‌రీ సినిమాకే హైలైట్

By:  Tupaki Desk   |   17 March 2020 4:30 AM GMT
#RRR ఎన్టీఆర్ రాబ‌రీ సినిమాకే హైలైట్
X
పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత‌ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `ఆర్‌.ఆర్‌.ఆర్‌` పై ఇటు సౌత్ అటు నార్త్ రెండుచోట్లా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. `బాహుబలి` ఫ్రాంఛైజీతో తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం అందుకు కారణం. అంతేకాదు టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ ఎన్టీఆర్‌- రామ్ చరణ్‌ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ కావడం తాజా క్రేజుకు కార‌ణం. మ‌రోసారి జాతీయ స్థాయిలో హైప్‌ ఏర్పడింది. దీనికితోడు రాజమౌళి ఎంచుకున్న కథ యూనివర్సల్‌ కాన్సెప్ట్ కావడం ఈ హైప్ మ‌రింత పెర‌గ‌డానికి కారణమని చెప్పొచ్చు.

స్వాతంత్య్ర‌ ఉద్యమంలో పాల్గొనడానికి ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీమ్‌.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు ఏం చేశారు? ఆ ఇద్ద‌రూ క‌లిసి ఆంగ్లేయుల్ని ఎలా ఎదుర్కొన్నారు? అన్న క‌థ‌ను ఫిక్ష‌న‌ల్ ఎలిమెంట్స్ తో తనదైన‌ మార్క్ హంగులతో రాజమౌళి తెరరూపమిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌.. చరణ్ కి జోడిగా అలియా భట్‌ నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌.. తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇందులో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారనే వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్‌ అవుతుంది. అయితే ఆయన మూడు భిన్నమైన గెటప్‌ల్లో కనిపిస్తారా? లేక మూడు పాత్రల్లో కనిపిస్తారా? అన్నది ఒకింత సస్పెన్స్ తో పాటు మరికొంత ఎగ్జైట్ మెంట్ ని పెంచుతుంది. అంతేకాదు ఈ వార్త సినిమా పై అంచనాలను ఆకాశమే హద్దుగా పెంచేస్తోంది. ఇక ఈ మూడు పాత్ర‌ల్లో ఒక‌టి రోబ‌రీలు చేసే పాత్ర‌. రైళ్ల నుంచి బాంబ్ లు .. వెపన్స్ దొంగిలించే దొంగ‌గానూ ట్రీటిస్తాడ‌ట‌.

ఓ వైపు కరోనా వైరస్ తో ప్రపంచమే అతలాకుతలమవుతుండగా, మన ఇండియాలో దాదాపు అన్నిభాషల చిత్ర పరిశ్రమలు షూటింగ్‌లు.. సినిమా విడుదలలు... థియేటర్ల బంద్‌ నిర్వహిస్తున్నారు. కానీ హైదరాబాద్ అల్లూమీనియం ఫ్యాక్టరీ లో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ సైలెంట్ గా షూటింగ్‌ జరుపుతోంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. కరోనా వైరస్‌ అయితే మాకేంటి అని తమ పని తాము చేసుకుంటున్నారు. అంతేకాదు సోమవారం సాయంత్రం ఎన్టీఆర్‌- చరణ్‌ కలిసి కరోనా వైరస్ కి సంబంధించి అవగాహన కల్పించే పని చేపట్టారు. అందులో భాగంగా ``ఈ ఆరు సూత్రాలు పాటించండి`` అని కరోనా సోకకుండా ఉండేందుకు అందరు చెప్పే సలహాలనే తమదైన స్టయిల్‌లో చెప్పారు. ఇంతకి తమ సినిమా అప్‌డేట్‌ని మాత్రం చెప్పకపోవడం గమనార్హం.