Begin typing your search above and press return to search.

తోపు అని చెప్పుకునే బాంబేలో ఈ కుళ్లు ఏంటీ?

By:  Tupaki Desk   |   31 March 2022 2:30 AM GMT
తోపు అని చెప్పుకునే బాంబేలో ఈ కుళ్లు ఏంటీ?
X
ఇండ‌స్ట్రీలో ఎదురే లేకుండా చ‌క్రం తిప్పేయాల‌ని కొంద‌రికి ఉంటుంది. కానీ అదేమీ అంత వీజీ కాదు. ప్ర‌తిదీ గుప్పిట ప‌ట్టి అనుకున్న‌ట్టు ముందుకు సాగాలంటే ప‌రిశ్ర‌మ‌లో చాలా స‌హ‌క‌రించాలి. అయితే రంగుల ప్ర‌పంచంలో ఇటీవ‌లి కాలంలో కొత్త‌త‌రం వెల్లువ‌లా ఉంది. ఎవ‌రూ ఎవ‌రినీ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

మ‌రోవైపు బాలీవుడ్ లాంటి చోట బ‌య‌టికి క‌నిపించ‌ని మాఫియా ఒక‌టి ర‌న్ అవుతోంద‌న్న గుస‌గుస చాలా కాలంగా ఉంది. దీనిపై కంగ‌న ర‌నౌత్ లాంటి స్టార్లు నిరంత‌రం ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇక‌పోతే ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం హిందీలోనూ అంతే భారీగా విడుద‌లైంది. అక్క‌డ కూడా చెప్పుకోద‌గ్గ రేంజులో వ‌సూళ్ల‌ను సాధిస్తోంది.

కానీ ఈ సినిమా బావుంది.. థియేట‌ర్ల‌కు వెళ్లండి!! అంటూ పాజిటివ్ వ‌ర్డ్ ఒక్క బాలీవుడ్ స్టార్ హీరో నోటి నుంచి కూడా రాలేదు. అయితే దీనికి కార‌ణ‌మేమిటీ? అంటే.. హీరోలంద‌రినీ ఓ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ అదుపులో ఉంచార‌ని తెలిసింది. అన‌వ‌స‌ర‌మైన ట్వీట్లు కామెంట్లు ఆర్.ఆర్.ఆర్ పై వ‌ద్ద‌ని వారించార‌ట‌.

సినిమా బావుంద‌ని బ‌య‌ట టాక్ ఉంది. కానీ మ‌నం దేనికి ప్ర‌చారం చేయ‌డం.. ఆడ‌నివ్వండి!! అని అన్నార‌ట‌. ఇక ఇంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని రిలీజ్ చేసే అవ‌కాశం కానీ లేదా ప్ర‌చారంలో పాల్గొనే ఛాన్స్ కానీ త‌న‌కు ద‌క్క‌నందుకు కొంత బాధ‌ప‌డ్డార‌ని కూడా తెలిసింది.

అయితే అత‌డు ఎవ‌రు? అన్న‌ది అటుంచితే .. ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోల్లో.. స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక ర‌క‌మైన ఇన్ సెక్యూరిటీ క‌నిపిస్తోంది. తోపు అని చెప్పుకునే ప‌రిశ్ర‌మ‌లో త‌మ సినిమాల్ని మించి ద‌క్షిణాది సినిమా హ‌వా సాగించ‌డం అస్స‌లు మింగుడు ప‌డ‌డం లేదు. అందునా తెలుగు సినిమా జ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తూ రికార్డుల్ని బ్రేక్ చేస్తుంటే అస‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు.

ఖాన్ లు కానీ కిలాడీలు కానీ ఏదో ఒక రూపంలో త‌మ లోగుట్టును దాచుకోలేక బ‌య‌ట‌ప‌డిపోయిన సంద‌ర్భాలున్నాయి. అస‌లే హిట్లు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న వీళ్ల‌కు టాలీవుడ్ రూపంలో పెద్ద కాంపిటీష‌న్ ఎదుర‌వ్వ‌డం చూస్తుంటేనే ఇది ఊహించ‌నిదిగా క‌నిపిస్తోంది. ఓవ‌రాల్ గా ఈ స‌న్నివేశంలో కొంద‌రు విచిత్ర‌మైన పోక‌డ‌ల‌కు పోతున్నారు. వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ పై ఒక్క బాలీవుడ్ స్టార్ కూడా ట్వీట్ చేయ‌క‌పోవ‌డం చూస్తుంటే అనుమానించాల్సిందే మ‌రి. ఇక‌పోతే రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి 1 - బాహుబ‌లి 2 ఉత్త‌రాదిన సంచ‌ల‌నాలు న‌మోదు చేశాయి. త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ తోనూ హిందీ బెల్ట్ లో అసాధార‌ణ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మునుముందు రాజ‌మౌళి సినిమా వ‌స్తోంది! అంటే అక్క‌డ ఆగి చూడ‌టం గ్యారెంటీ. ఇలాంటి ఘ‌న‌త ద‌ర్శ‌క‌ధీరుడు ద‌క్కించుకున్నందున‌.. తెలుగు సినిమా స్టామినాను అమాంతం పెంచినందున‌.. అత‌డికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ది కశ్మీర్ ఫైల్స్ పైనా ఇలానే..!

ఇటీవ‌లే విడుద‌లైన ది క‌శ్మీర్ ఫైల్స్ సినిమా బంప‌ర్ హిట్ కొట్టినా స్టార్ హీరోలు ఎవ‌రూ దీనిపై పెద్దంత‌గా స్పందించ‌లేదు. సోష‌ల్ మీడియాల్లో పెద్ద‌గా ఎంక‌రేజ్ చేయ‌లేదు. నిజానికి స్టార్ హీరోలు స‌రైన సినిమాలు తీయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ డాక్యుమెంట‌రీ త‌ర‌హా సినిమా హిట్ట‌య్యింద‌న్న వాద‌నా ఒక సెక్ష‌న్ లో ఉంది. మౌత్ టాక్ తోనే బంప‌ర్ హిట్ట‌య్యింది ఈ చిత్రం. ఇక ఈ సినిమా రికార్డుల్ని కూడా ఆర్.ఆర్.ఆర్ బ్రేక్ చేసి దూసుక‌పోతోంది.