Begin typing your search above and press return to search.

జపాన్ థియేటర్ ని ఆర్టీసీ క్రాస్ రోడ్ చేసేశారు..!

By:  Tupaki Desk   |   27 Nov 2022 5:30 PM GMT
జపాన్ థియేటర్ ని ఆర్టీసీ క్రాస్ రోడ్ చేసేశారు..!
X
వరల్డ్ వైడ్ గా RRR ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటించిన ఈ మూవీని రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక రీసెంట్ గా జపాన్ లో గ్రాండ్ గా రిలీజైన RRR అక్కడ కూడా రికార్డ్ వసూళ్లతో అదరగొడుతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా అక్టోబర్ 21న జపాన్ లో రిలీజైంది. రిలీజ్ టైం లో ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాజమౌళి ముగ్గురు అక్కడ భారీ ప్రమోషన్స్ చేశారు.

జపాన్ లో ఇప్పటివరకు 350 మిలియన్ యాన్ ల కలక్షన్స్ తో దూసుకెళ్తుంది ఆర్.ఆర్.ఆర్. ఇక లేటెస్ట్ గా అక్కడ థియేటర్ లో పరిస్థితి ఒక ఫ్యాన్ షేర్ చేశాడు. దాన్ని ఆర్.ఆర్.ఆర్ మూవీ టీం రీ ట్వీట్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ ఆడుతున్న జపాన్ థియేటర్ లో స్క్రీన్ కూడా కనిపించనంతగా కాగితాలు విసిరేశారు. ఆ పిక్ చూసి ఇదేదో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని థియేటర్ అనిపించేలా ఉంది. జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ ఒక్క ఫోటోతో చెప్పొచ్చు.

రిలీజ్ కు ముందే అక్కడ RRR సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఎన్.టి.ఆర్, చరణ్ అక్కడకు వెళ్లి ప్రమోట్ చేయడం సినిమాకు మరింత బూస్టప్ ఇచ్చింది. ఫలితంగా ఆర్.ఆర్.ఆర్ కు జపాన్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. లాంగ్ రన్ లో RRR అక్కడ సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా అది కూడా సూపర్ స్టార్ రజనీ సినిమా ముత్తు మాత్రమే జపాన్ లో 400 మిలియన్ యాన్ లు సాధించింది.

ఆర్.ఆర్.ఆర్ దూకుడు చూస్తుంటే ముత్తు రికార్డ్ ని త్వరలోనే బ్రేక్ చేసేలా ఉంది. తెలుగు సినిమాలకు ఇప్పుడు జపాన్ మార్కెట్ కూడా లెక్కలోకి వచ్చేలా ఉంది. ఆర్.ఆర్.ఆర్ ఇప్పటికే 1000 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ కాగా జపాన్ వసూళ్లతో కలిపి బాహుబలి వసూళ్లని దాటేసేలా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.